టీటీడీ లడ్డూ తయారీలో నెయ్యి అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 20,2024: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 20,2024: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలను, భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో శ్రీవారి లడ్డూ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థ సారధితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంలో, ముఖ్యమంత్రి టీటీడీ ఈవోకు ఈ రోజు సాయంత్రం వరకు లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్‌లతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడుతామని చంద్రబాబు నాయుడు చెప్పారు.

About Author