శ్రీనివాసమంగాపురంలో సింహ వాహన సేవలో ఆకట్టుకున్న చండ మేళం, కోలాటం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఫిబ్రవరి 20,2025: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం నిర్వహించిన సింహ వాహనసేవ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఫిబ్రవరి 20,2025: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం నిర్వహించిన సింహ వాహనసేవ భక్తులకు విశేష అనుభూతిని అందించింది.
ఈ సందర్భంగా చండ మేళం, కోలాటాల కళాప్రదర్శనలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమాలను టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించారు.
Read this also...Bharti AXA Life Insurance Secures Strategic Investment from 360 ONE Asset to Accelerate Growth
Read this also...“Lionsgate Play Premieres Telugu Crime Thriller ‘Dhakshina’ on February 21”
Read this also...The Hype Begins: Zee Studios & Prerna V Arora’s Pan-India Film “Jatadhara” Featuring Sudheer Babu Commences Shooting in Hyderabad
చండ మేళం ప్రదర్శన
కర్ణాటక రాష్ట్రం ఉడుపి ప్రాంతానికి చెందిన శ్రీ అనిల్ బృందం ఆధ్వర్యంలో చండ మేళం (కేరళ డ్రమ్స్) ప్రదర్శన చేపట్టారు. ఈ బృందంలో మొత్తం 9 మంది కళాకారులు పాల్గొన్నారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ, అందుకు అనుగుణంగా అడుగులు వేసి విశేషంగా ఆకట్టుకున్నారు.

కోలాటాల ప్రదర్శనలు – భక్తులని విశేషంగా ఆకర్షించిన కళా బృందాలు
ఇదే కార్యక్రమంలో నల్గొండకు చెందిన కనకదుర్గ కోలాట భజన బృందం నుంచి 25 మంది కళాకారులు, తిరుపతికి చెందిన శ్రీ వల్లభ కోలాట భజన బృందం నుంచి 20 మంది చిన్నారులు కోలాట ప్రదర్శన అందించారు.
ఇది కూడా చదవండి. “రైతు ద్రోహి జగన్.. మిర్చి రైతులపై మోసపు నాటకం: మంత్రి సవిత”
ఇది కూడా చదవండి.2024లో అత్యధిక ESG రేటింగ్ సాధించిన వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్
ఇది కూడా చదవండి..నథింగ్ ఫోన్ (3a) సిరీస్: విప్లవాత్మక కెమెరా ఫీచర్లతో మార్చి 4న ఆవిష్కరణ
అదనంగా పాకాల, నారావారిపల్లి, కాకినాడ ప్రాంతాలకు చెందిన కళా బృందాలు కూడా కోలాట నృత్యాలు ప్రదర్శించి భక్తుల మనసును దోచుకున్నాయి.
ఈ బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన చండ మేళం, కోలాటాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించాయి.