పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 2,2025: కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 10 నుంచి 14వ తేదీ వరకు వార్షిక

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 2,2025: కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 10 నుంచి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మార్చి 9న సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణతో ఉత్సవాలకు శుభారంభం కానుంది.
ఇది కూడా చదవండి...శ్రీ వేంకటేశ్వరస్వామివారి మోహినీ అలంకార సేవా వైభవం
ఇది కూడా చదవండి...L2 ఎంపురాన్’ నుంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్రను రివీల్ చేసిన చిత్ర బృందం
Read this also... L2: Empuraan Goes Global – Game of Thrones Star Jerome Flynn Joins the Cast
మార్చి 10న ఉదయం 10.10 నుంచి 10.30 గంటల వరకు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడనున్నారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. మార్చి 11న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 వరకు భక్తులకు గరుడ వాహన సేవ దర్శనమివ్వనుంది.

మార్చి 11, 12, 13వ తేదీల్లో ఉదయం 10 గంటలకు స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. మార్చి 12, 13వ తేదీల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఊంజల్ సేవ జరగనుంది. మార్చి 14న ఉదయం 10.10 నుంచి 10.30 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణం ఘనంగా నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి...స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ – భారత్‌లో అతిపెద్ద హోమ్ హెల్త్ కేర్ నెట్‌వర్క్ విస్తరణ
Read this also... Star Health Insurance Expands Home Health Care Network to 100 Locations Across India
అంతేగాక, మార్చి 15న సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరిపించనున్నారు. ఈ పవిత్ర బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు.