భారత్ సంజీవని కృషి ఉత్థాన్ కార్యక్రమం: రైతుల సాధికారతకు ఐబీఎల్, బీఎఫ్ఐఎల్ భాగస్వామ్యం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,నవంబర్ 19,2024: భారత్ సంజీవని కృషి ఉత్థాన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించేందుకు భారత ప్రభుత్వ కేంద్ర

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,నవంబర్ 19,2024: భారత్ సంజీవని కృషి ఉత్థాన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించేందుకు భారత ప్రభుత్వ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (MoA & FW)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇండస్‌ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ (ఐబీఎల్),ఐబీఎల్ అనుబంధ సంస్థ అయిన భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్ (బీఎఫ్ఐఎల్) వెల్లడించాయి.

దేశవ్యాప్తంగా ఎఫ్‌పీవోలకు సాధికారత కల్పించే దిశగా పటిష్టమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం “10,000 రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవో) ఏర్పాటు,ప్రమోషన్”కు మద్దతు కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.

రైతుల్లో మరింత మెరుగ్గా బేరమాడే సామర్ధ్యాలను పెంపొందించేందుకు, విస్తృత స్థాయిలో ఉత్పత్తి చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు, ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకునేందుకు, వ్యవసాయోత్పత్తిని అగ్రిగేట్ చేయడం ద్వారా ఆదాయాలను పెంచుకునేందుకు ఎఫ్‌పీవోలు తోడ్పడతాయి.

తద్వారా రైతులు సుస్థిరమైన విధంగా ఆదాయాలను అందుకోవడంలో సహాయకరంగా ఉంటాయి. ముఖ్యంగా సన్నకారు రైతుల వ్యవసాయ ఉత్పాదకతను, లాభదాయకతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న విస్తృతమైన వ్యూహంలో ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఒక భాగం.

బీఎఫ్ఐఎల్,ఐబీఎల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) భాగస్వామ్యం కింద చేపట్టిన ఈ కార్యక్రమాలు, 11 రాష్ట్రాలవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, సుస్థిర సాగు విధానాలను ప్రోత్సహించడం, రైతుల ఆదాయాలను నిలకడగా మెరుగుపర్చడం అనే లక్ష్యాలతో పనిచేస్తాయి.

ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.

భారత్ సంజీవని కృషి ఉత్థాన్ కార్యక్రమం కింద ఎఫ్‌పీవో ప్రాజెక్టుల అమల్లో మార్గదర్శకత్వం వహించేందుకు, సమర్ధమంతంగా పర్యవేక్షించేందుకు, మద్దతునిచ్చేందుకు బీఎఫ్ఐఎల్ ,ఐబీఎల్ జాతీయ స్థాయిలోను,11 టార్గెట్ రాష్ట్రాల్లో ఒక సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ని (సీపీఎంయూ) ఏర్పాటు చేస్తాయి.

ఎఫ్‌పీవో అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు, గ్రామీణ సాధికారత కోసం వినూత్నమైన పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలను ఏర్పర్చే దిశగా జరుగుతున్న కృషిలో భాగంగా కార్పొరేట్ సంస్థలు,వ్యవసాయ శాఖకు మధ్య తొలిసారిగా భాగస్వామ్యం కుదరడాన్ని ఈ ఎంవోయూ ప్రతిఫలిస్తుంది.

కార్యకలాపాలను మెరుగుపర్చుకోవడంలో, స్థితిస్థాపకతను సాధించడంలో, వ్యాపారాలను విస్తరించడంలో సహాయం అందించడం ద్వారా ఎఫ్‌పీవోలకు సుస్థిర వృద్ధి బాటను సృష్టించేందుకు డేటా నిర్వహణ, కెపాసిటీ-బిల్డింగ్, ఐటీ మౌలిక సదుపాయాలు మొదలైన అంశాల్లో ఈ ఎంవోయూ ద్వారా బీఎఫ్ఐఎల్ మరియు ఐబీఎల్ తగు సాంకేతిక సహకారం అందిస్తాయి.

ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్లేలా రోజువారీ కార్యకలాపాలనుసమన్వయపర్చుకునేందుకు వ్యవసాయం/హార్టికల్చర్ ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, మార్కెట్ లింకేజీలు, కోల్డ్ చెయిన్స్, సామాజిక రంగం మొదలైన విభాగాల్లో నిపుణుల సేవలను బీఎఫ్ఐఎల్, ఐబీఎల్ అందుబాటులో ఉంచుతాయి.

కేంద్ర వ్యవసాయ,రైతు సంక్షేమ శాఖ (MoA & FW)బీఎఫ్ఐఎల్, ఐబీఎల్ ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. “వ్యవసాయ రంగంలో సాంకేతికతను వినియోగంలోకి తేవడంలో బీఎఫ్ఐఎల్ మరియు ఐబీఎల్‌కి గల నిబద్ధత ప్రశంసనీయమైనది.

ఐటీ సొల్యూషన్స్‌ను వినియోగిస్తూ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌పరంగా మద్దతు,తమ నైపుణ్యాల తోడ్పాటును అందిస్తూ, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో,తమ ఉత్పత్తి విధానాలను మెరుగుపర్చుకోవడంలో రైతులకు బీఎఫ్ఐఎల్,ఐబీఎల్ సాధికారత కల్పిస్తున్నాయి.

తద్వారా వ్యవసాయ రంగ వృద్ధి, సుస్థిరతకు తోడ్పడుతున్నాయి” అని MoA & FW అదనపు కార్యదర్శి Mr. ఫయాజ్ అహ్మద్ కిద్వాయ్ తెలిపారు.

“భారత ప్రభుత్వంతో భాగస్వామ్యమనేది సుస్థిరమైన, సమ్మిళితమైన వృద్ధిని పెంపొందించే దిశగా మా ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిలాంటిది. వ్యవసాయ అనుబంధ సర్వీసుల నుంచి వ్యవసాయ ప్రధాన స్రవంతికి మా తోడ్పాటును విస్తరించడం ద్వారా ఒడిదుడుకులను ఎదుర్కొనేలా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దడం.

గ్రామీణ భారతదేశంలో సాధికారత కల్పించాలన్న జాతీయ లక్ష్యానికి అనుగుణంగా మేము పనిచేస్తున్నాం” అని ఐబీఎల్ హెడ్ (ఇన్‌క్లూజివ్ బ్యాంకింగ్, సీఎస్ఆర్ & సస్టెయినబిలిటీ) Mr. శ్రీనివాస్ బోనం తెలిపారు.

“ఎఫ్‌పీవోలకు మద్దతునిచ్చే దిశగా భారత్ సంజీవని కృషి ఉత్థాన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించేందుకు వ్యవసాయ శాఖతో ఈ ఎంవోయూను కుదుర్చుకోడం ద్వారా రైతులకు నేరుగా ప్రయోజనం కల్పించే టెక్నాలజీ ఆధారిత సొల్యూషన్స్‌ను అందించగలుగుతు న్నందుకు మేము సంతోషిస్తున్నాం.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో నిరంతరం కృషి చేసిన అనుభవం, వ్యవసాయ రంగానికి కూడా తోడ్పాటు అందించేందుకు మాకు ఉపయోగపడనుంది. రైతుల ఆదాయాన్ని గణనీయంగా, సుస్థిరమైన విధానంలో మెరుగుపర్చేలా పటిష్టమైన, ఫలవంతమైన ఎఫ్‌పీవోలను తీర్చిదిద్దడం లక్ష్యంగా నిర్దేశించుకున్నాం” అని బీఎఫ్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ Mr. జె. శ్రీధరన్ తెలిపారు.

రైతులకు నేరుగా సమగ్రమైన వెటర్నరీ సర్వీసులు అందించడం ద్వారా గ్రామీణ కమ్యూనిటీలకు మద్దతునందించే డిజిటల్ కార్యక్రమం భారత్ సంజీవని ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల్లో సేవలందించిన అనుభవంతో బీఎఫ్ఐఎల్,ఐబీఎల్ తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ భాగస్వామ్యం ద్వారా వ్యవసాయ రంగానికి కూడా మద్దతును అందిస్తున్నాయి.

ప్రాజెక్టులో నిర్దేశిత మైలురాళ్లను సాధించేలా బీఎఫ్ఐఎల్, ఐబీఎల్,కేంద్ర వ్యవసాయ శాఖ త్రైమాసికాలవారీగా పురోగతిని సంయుక్తంగా సమీక్షిస్తాయి. సవాళ్లేమైనా ఎదురైతే పరిష్కరిస్తాయి.

భారత ప్రభుత్వం, బీఎఫ్ఐఎల్,ఐబీఎల్ తమ భాగస్వామ్యంతో, సాగురంగానికి అవసరమైన వనరులను అందించడం.రైతులకు మద్దతును కల్పించడం ద్వారా భారతదేశ వ్యవసాయ రంగ అభివృద్ధికి, సుస్థిరతకు దోహదపడే విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నారు.

About Author