భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో అధునాతన ఆటోమోటివ్ పరిష్కారాలను ఆవిష్కరించిన ఏటీఎస్ ఈఎల్జీఐ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 20,2025: భారతదేశంలో ప్రఖ్యాత గ్యారేజీ పరికరాల తయారీదారులలో ఒకటైన ఎటీఎస్ ఈఎల్జీఐ, ఎల్గి ఎక్విప్మెంట్స్ లిమిటెడ్ అనుబంధ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 20,2025: భారతదేశంలో ప్రఖ్యాత గ్యారేజీ పరికరాల తయారీదారులలో ఒకటైన ఎటీఎస్ ఈఎల్జీఐ, ఎల్గి ఎక్విప్మెంట్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తమ నూతన ఆటోమోటివ్ సర్వీస్ పరిష్కారాలను ఆవిష్కరించింది. జనవరి 18 నుండి 21 వరకు యశోభూమిలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పో కాంపోనెంట్స్ షోలో టచ్‌లెస్ వీల్ అలైనర్, హై-పర్ఫార్మెన్స్ కొలిజన్ రిపేర్ సిస్టమ్ (CRS), అడ్వాన్స్‌డ్ వెల్డింగ్ పరికరాలు, ఈవి పరికరాలు వంటి విప్లవాత్మక సాంకేతిక పరిష్కారాలను బూత్ నంబర్ 7, హాల్ 02లో ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఏటీఎస్ ఈఎల్జీఐ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ తివారీ మాట్లాడుతూ, “ఆధునాతన, సుస్థిర మరియు నమ్మదగిన పరిష్కారాలతో ఆటోమోటివ్ సేవా రంగాన్ని పునర్నిర్వచించడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.

అంతేకాదు, “Auto Expo 2025లో ప్రదర్శించిన స్మార్ట్‌లైట్ టచ్‌లెస్ వీల్ అలైనర్, ఆటోరోబోట్ కొలిజన్ రిపేర్ సిస్టమ్, టెల్విన్ వెల్డింగ్ పరికరాలు, బ్యాటరీ లిఫ్ట్, బ్యాటరీ మాడ్యూల్ బ్యాలెన్సర్, ఏసీఆర్‌యూ మెషిన్, బ్యాటరీ లీక్ డిటెక్షన్, స్పెషలైజ్డ్ ఈవి టూల్స్ వంటి పరిష్కారాలు పరిశ్రమ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఆటోమోటివ్ సేవల భవిష్యత్తును స్వీకరించడంలో నమ్మకమైన భాగస్వామిగా ఏటీఎస్ ఈఎల్జీఐ పాత్రను మరింత బలోపేతం చేస్తాయి” అని తెలిపారు.

ప్రదర్శించిన ముఖ్య విశేషాలు:

  • స్మార్ట్‌లైట్ టచ్‌లెస్ వీల్ అలైనర్: చక్రాల క్లాంపర్లు లేకుండా, సంప్రదాయ అలైన్ పద్ధతులను మరిపించే అత్యాధునిక టెక్నాలజీ. వేగవంతమైన పనితీరు, ఖచ్చితమైన సర్దుబాటు, మరియు వాహన డౌన్‌టైమ్ తగ్గింపు.
  • ఆటోరోబోట్ కొలిజన్ రిపేర్ సిస్టమ్ (CRS): విభిన్న దిశల్లో పని చేయగల సామర్థ్యం కలిగిన సిల్లు క్లాంపులు మరియు మెరుగైన చాసిస్ రిపేర్ పరిష్కారాలు.
  • టెల్విన్ వెల్డింగ్ పరికరాలు: శక్తివంతమైన పనితీరు, తక్కువ సమయంలో మెరుగైన ఫలితాలు అందించే సామర్థ్యం.
  • ఈవి పరికరాల శ్రేణి: అధిక-వోల్టేజ్ బ్యాటరీల కోసం ప్రత్యేక పరికరాలు, శీఘ్ర డయాగ్నోస్టిక్స్, మరింత భద్రత, మరియు వేగవంతమైన సేవలు అందించే టూల్స్.

About Author