శ్రీవారి సేవలో అన్నా కొణిదల… కుమారుడి పేరిట రూ.17 లక్షల విరాళం..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 14,2025: తిరుమల శ్రీవారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల సోమవారం దర్శించుకున్నారు.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 14,2025: తిరుమల శ్రీవారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల సోమవారం దర్శించుకున్నారు. వేకువజామున వైకుంఠ క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలో ప్రవేశించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..“అంబేద్కర్ ఆశయాల బాటలోనే సాగుతాం” – పవన్ కల్యాణ్

ఇది కూడా చదవండి..శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించిన అన్నా కొణిదల

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలు సమర్పించారు. అనంతరం అఖిలాండంలో హారతులు సమర్పించి, స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

అన్నప్రసాద వితరణలో పాల్గొన్న అన్నా కొణిదల

అలాగే ఉదయం 10 గంటలకు తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. కుమారుడు కొణిదల మార్క్ శంకర్ పేరిట రూ.17 లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు అందజేశారు.

ఇది కూడా చదవండి..“తెలంగాణ ప్రభుత్వంతో గోద్రెజ్ క్యాపిటల్ ఆర్థిక సహకారం: MSMEలకు కొత్త రుణ అవకాశాలు”

అనంతరం స్వయంగా అన్నప్రసాద వితరణలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు. తరువాత భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

About Author