శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించిన అన్నా కొణిదల
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, ఏప్రిల్ 14,2025: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల ఆదివారం సాయంత్రం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, ఏప్రిల్ 14,2025: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల ఆదివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కొద్ది రోజుల క్రితం సింగపూర్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడిన నేపథ్యంలో, తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు ఆమె తిరుమల శరణు చేరారు.
ఇది కూడా చదవండి..“తెలంగాణ ప్రభుత్వంతో గోద్రెజ్ క్యాపిటల్ ఆర్థిక సహకారం: MSMEలకు కొత్త రుణ అవకాశాలు”
Read this also…Godrej Capital and Government of Telangana Sign MoU to Boost MSME Growth
Read this also…Bank of India Celebrates 10 Years of Transformative Impact Through Pradhan Mantri Mudra Yojana
శనివారం అర్ధరాత్రి సింగపూర్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం, ఆదివారం తిరుమలకు చేరుకున్న అన్నా కొణిదల, టీటీడీ నిబంధనల మేరకు గాయత్రి సదనంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు.

అనంతరం శ్రీ వరాహ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తలనీలాలు సమర్పించేందుకు పద్మావతి కళ్యాణకట్టకు వెళ్లి, భక్తులతో కలిసి తలనీలాలు సమర్పించారు.
సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని ప్రధానాలయంలో శ్రీ వారిని దర్శించుకున్నా అన్నా, టీటీడీ నిత్య అన్నదానానికి విరాళం అందించనున్నట్లు సమాచారం. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరించారు అన్నా కొణిదల..