అమిత్ షాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 22, 2024: దేశం కోసం అంకిత భావంతో కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైన కేంద్ర హోమ్ శాఖామాత్యులు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 22, 2024: దేశం కోసం అంకిత భావంతో కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైన కేంద్ర హోమ్ శాఖామాత్యులు అమిత్ షా కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దేశంలో అంతర్గత భద్రత వ్యవస్థను పటిష్టపరచడంలో అమిత్ షా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారు.
ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు, తీసుకొంటున్న నిర్ణయాలతో అంతర్గత భద్రత మెరుగవుతోంది. రాష్ట్రాల్లో తలెత్తే ప్రకృతి విపత్తుల సమయంలోనూ అమిత్ షా సత్వరమే స్పందిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి తరఫున అందించిన సూచనలు, విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలిస్తున్నారు.

దేశమే ముందు అనే విశాల భావన కలిగిన అమిత్ షాకి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.