అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖామాత్యులు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 11,2024: మంత్రులు, డీజీపీ, కలెక్టర్లు, శాఖాధిపతులు, ఇతర సిబ్బందికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 11,2024: మంత్రులు, డీజీపీ, కలెక్టర్లు, శాఖాధిపతులు, ఇతర సిబ్బందికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, అభివృద్ధి వ్యూహాలను చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా “విజన్ ఆంధ్రా 2047” లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.పేద ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు తపన పడే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.ఆంధ్రప్రదేశ్‌కు మంత్రి నారా లోకేష్ ఒక స్ఫూర్తిదాయక నేతగా నిలుస్తున్నారు.

గత ప్రభుత్వాలనుండి అప్పులు, భూకబ్జాలు, డ్రగ్స్ మాఫియా వంటి సమస్యలు వారసత్వంగా వచ్చాయి.అయితే, అందరికీ వారసత్వంగా భూమిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కబ్జాకు గురైన భూమిని తిరిగి పేదవాడికి అందించేందుకు కట్టుబడి ఉన్నాం.

ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం.భూఅక్రమార్కుల కట్టడికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను అసెంబ్లీలో ఆమోదింపజేసి, చట్టంగా మార్చబోతున్నాం.

భూకబ్జాలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్ష వంటి కఠిన చర్యలు తీసుకోనున్నాం.గత ప్రభుత్వ కాలంలో 9.26 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్‌గా చేశారని, అందులో 4.21 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని నిర్ధారణకు వచ్చాం.

ఇళ్ల పట్టాల పేరుతో జరిగిన స్కాంలపై కూడా చర్యలు తీసుకుంటాం.రెవెన్యూ శాఖలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.

  • భూ సమస్యల పరిష్కారం ద్వారా ప్రజలకు న్యాయం చేయడం.
  • ఇప్పటివరకు వచ్చిన 31,324 ఫిర్యాదుల్లో 400 సమస్యలను వెంటనే పరిష్కరించాం. మిగిలిన వాటిపై చర్యలు వేగవంతం చేస్తున్నాం.
  • రీసర్వే ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు కట్టుబడి ఉన్నాం.
  • భూమి హక్కుపత్రాలను రాజముద్ర, క్యూఆర్ కోడ్, ల్యాండ్ మ్యాప్‌తో సమకూర్చి అందిస్తాం.
  • ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి చేర్చే వారధిగా కలెక్టర్లు పనిచేయాలి.
  • భూసమస్యలు లేకుండా రాష్ట్ర అభివృద్ధి దిశగా కలెక్టర్ల సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి ఆచరణలో పెట్టాలి.

About Author