ఈనెల 18న ఏపి పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 16,2025: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 18న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఆయన గన్నవరం సమీపంలో కృష్ణా జిల్లాలో

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 16,2025: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 18న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఆయన గన్నవరం సమీపంలో కృష్ణా జిల్లాలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF),ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను ప్రారంభించనున్నారు.

అమిత్ షా శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి చేరుకుంటారు. ఆ రాత్రి, ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

అనంతరం ఆయన విజయవాడలోని హోటల్లో బస చేయనున్నారు.

19న ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ప్రారంభోత్సవం చేయనున్నారు.

ప్రారంభోత్సవం అనంతరం, అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

About Author