హీరో అజిత్ కుమార్ తాజా యాక్షన్ మూవీ ‘పట్టుదల’ ట్రైలర్ విడుదల
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 16,2025: అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్, లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో మగిల్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 16,2025: అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్, లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో మగిల్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’, తెలుగు ప్రేక్షకులకు ‘పట్టుదల’ పేరుతో విడుదల కాబోతోంది. ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమా గ్రాండ్‌గా విడుదలవుతోంది.
అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచనాల్ని సొంతం చేసుకున్న ఈ సినిమాపై అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసి, సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు.

ట్రైలర్ హైలైట్స్:
అజిత్ కుమార్ స్టైలిష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదిరిపోయే ప్రెజెన్స్‌తో కనిపించనున్నారు. తన కుటుంబం కోసం విలన్లతో పోరాడుతున్న అజిత్ యాక్షన్ సన్నివేశాలు, త్రిషతో క్యూట్ కెమిస్ట్రీ, అజర్ బైజాన్‌లో షూట్ చేసిన గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకుంటున్నాయి.
అర్జున్ స్టైలిష్ లుక్‌తో పాటు ఖైదీగా కనిపిస్తుండగా, రెజీనా కసాండ్ర వినూత్న పాత్రలో మెప్పించనున్నారు. ఈ సినిమాలో ఆరవ్, నిఖిల్ నాయర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
ఓంప్రకాష్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అనిరుద్ రవిచందర్ సంగీతం, బీజీమ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది.
సినిమాటోగ్రఫీ: ఓంప్రకాష్
ఎడిటర్: ఎన్.బి. శ్రీకాంత్
ఆర్ట్ డైరెక్టర్: మిలాన్
స్టంట్స్: సుందర్
కాస్ట్యూమ్స్ డిజైనర్: అను వర్ధన్
పబ్లిసిటీ డిజైనర్: గోపీ ప్రసన్న

శాటిలైట్, ఓటీటీ హక్కులు:
‘పట్టుదల’ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల కానుంది.
‘పట్టుదల’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఇప్పటికే పీక్స్‌కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 6న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.