సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110 – అసమానమైన డిజైన్,పనితీరు, సౌకర్యం,సౌలభ్యం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగస్టు 27,2024: ద్విచక్, త్రిచక్ర వాహనాల సెగ్మెంట్‌లో అంతర్జాతీయ దిగ్గజం టీవీస్ మోటర్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగస్టు 27,2024: ద్విచక్, త్రిచక్ర వాహనాల సెగ్మెంట్‌లో అంతర్జాతీయ దిగ్గజం టీవీస్ మోటర్ కంపెనీ (టీవీఎస్ఎం) తమ సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110ని ఆవిష్కరించింది. తదుపరి తరం ఇంజిన్, భవిష్యత్‌కాలపు, ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లు అనేకం ఈ స్కూటర్‌లో పొందుపర్చబడ్డాయి.
మరింత ఎక్కువ స్టయిల్, మైలేజ్,పనితీరు,సౌకర్యం,సౌలభ్యం,భద్రత, టెక్నాలజీ ఇలా అన్నింటిలోనూ “జ్యాదా” (మరింత అధికంగా) అందించాలనే లక్ష్యాన్ని ప్రతిఫలించే విధంగా సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110 తీర్చిదిద్దబడింది.
టీవీఎస్ జూపిటర్ అనేక మంది వాహనదార్లకు ఒక తిరుగులేని నేస్తంగా కొనసాగుతోంది. 65 లక్షల మంది పైగా కస్టమర్ల వైవిధ్య అవసరాలను నిరంతరం నెరవేరుస్తోంది.
“గత దశాబ్దకాలంగా టీవీఎస్ మోటర్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోకి టీవీఎస్ జూపిటర్ 110 అనేది ఒక లంగరుగా ఉంటోంది. ఇన్నేళ్లలో 65 లక్షల కుటుంబాల నమ్మకాన్ని చూరగొంది. తద్వారా ఇది భారతదేశంలోనే అతి పెద్ద ఆటోమోటివ్ బ్రాండ్స్‌లో ఒకటిగా ఎదిగింది.

సరికొత్తగా తీర్చిదిద్దిన ఆల్ న్యూ టీవీఎస్ జూపిటర్‌తో జ్యాదా కా ఫాయ్‌దా నినాదపు కీలక డీఎన్ఏ మరింత పటిష్టమైంది. ఆన్ డిమాండ్ టార్క్, మెరుగైన ఇంధన ఆదా, గణనీయంగా వినియోగించుకోతగిన స్థలం, సమకాలీన డిజైన్ వంటి ప్రత్యేకతలను అందించగలిగే సామర్ధ్యాల కారణంగా ఈ స్కూటర్ విశిష్టమైనదిగా నిలుస్తుంది.
ఈ ప్రత్యేకతలన్నీ కూడా కస్టమర్లను సంతోషపర్చేందుకు, టీవీఎస్ జూపిటర్ బ్రాండ్ వారి ప్రేమను చూరగొనేందుకు తోడ్పడగలవు” అని టీవీఎస్ మోటర్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ – కమ్యూటర్ బిజినెస్ హెడ్,కార్పొరేట్ బ్రాండ్ & మీడియా హెడ్ అనిరుద్ధ హల్దర్ (Aniruddha Haldar) ఈ సందర్భంగా తెలిపారు.

పనితీరు

టీవీఎస్ జూపిటర్ 110లో శక్తిమంతమైన 113.3 cc, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజిన్ ఉంది. ఇది 5.9 kW@6500 rpm శక్తిని, 9.8 Nm@ 5,000 rpm (iGO Assistతో)9.2 Nm @ 5,000 rpm టార్క్‌ని (Assist లేకుండా) అందిస్తుంది. దీనికన్నా ముందటి వెర్షన్‌తో పోలిస్తే 10% అధికంగా మైలేజీనిచ్చే శ్రేష్ఠమైన టెక్నాలజీ ఈ స్కూటర్‌లో పొందుపర్చబడింది. వినూత్నమైన iGO Assist టెక్నాలజీ ఇందుకు తోడ్పడుతుంది.
ఇందులో ఆటో స్టార్ట్-స్టాప్ ఫంక్షనాలిటీ,ఐఎస్‌జీ (ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్) గల ఇంటెలిజెంట్ ఇగ్నీషన్ సిస్టం ఉంది. ఓవర్‌టేక్ చేసేటప్పుడు, ఎత్తు ఎక్కేటప్పుడు బ్యాటరీ నుంచి శక్తిని తీసుకుని పనితీరును మరింత మెరుగుపర్చేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది. అవసరమైనప్పుడు కచ్చితమైన విధంగా అదనపు యాక్సిలరేషన్ పొందేందుకు ఇది సహాయపడుతుంది.
శ్రేష్ఠతకు నిదర్శనం
.స్టైల్, ఉత్తేజపు మేలు కలయిక: ఇన్ఫినిటీ ల్యాంప్స్
.పనితీరు, మైలేజీ కలబోత: సరికొత్త జూపిటర్ 110 ఇంజిన్,iGO Assist 10% అధిక మైలేజీ,మెరుగైన పికప్‌ను అందిస్తాయి
.ఆచరణాత్మకత, సౌకర్యం: ఫ్రంట్ ఫ్యుయల్ ఫిల్, పొడవైన సీటు, మరింత ఎక్కువ లెగ్ స్పేస్,బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ

.భద్రత,వినూత్నత: డబుల్ హెల్మెట్ స్టోరేజ్, మెటల్ మ్యాక్స్ బాడీ, ఫాలో మీ హెడ్‌ల్యాంప్స్, టర్న్ సిగ్నల్ ల్యాంప్ రెస్ట్, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్
.సాంకేతికత, సౌలభ్యం: కాల్, ఎస్ఎంఎస్, వాయిస్ అసిస్ట్‌తో నేవిగేషన్, ఫైండ్ మై వెహికల్ మరెన్నో ఫీచర్లతో పూర్తి స్థాయి డిజిటల్ బ్లూటూత్ ఎనేబుల్డ్ క్లస్టర్
.ఎంచుకునేందుకు ఐచ్ఛికాలు, ఆకర్షణీయత: ఆకట్టుకునే ఆరు రంగుల్లో విస్తృత శ్రేణి
టీవీఎస్ జూపిటర్ అనేది అత్యుత్తమైన విధంగా సౌకర్యం,సౌలభ్యాన్ని అందించేలా తీర్చిదిద్దబడింది. ఇందులో పలు సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు ఉన్నాయి. విశాలమైన గ్లవ్ బాక్స్, ఫ్రంట్ ఫ్యుయల్ ఫిల్, పొడవైన సీటు, ఆల్ ఇన్ వన్ లాక్, యూఎస్‌బీ మొబైల్ చార్జర్, పేటెంటు పొందిన E-Z సెంటర్ స్టాండ్ మొదలైనవి వీటిలో ఉన్నాయి.
మరింత కాంతినిచ్చే స్కూటర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంపుతో రాత్రిపూట ప్రయాణాలు మరింత సురక్షితంగా ఉండగలవు. అలాగే, సాఫీగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు మోటర్‌సైకిల్ తరహా ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, విశాలమైన 90/90-12 అంగుళాల టైర్లు దోహదపడతాయి.
ఫార్వర్డ్, లోయర్ మరింత సెంట్రల్ మాస్ పొజిషన్‌కి అనుగుణంగా తీర్చిదిద్దబడిన బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ 2.0 ఈ వాహనంలో పొందుపర్చబడింది. వాహనానికి అత్యంత స్థిరత్వాన్ని ఇచ్చేలా సెంటర్ ఆఫ్ గ్రావిటీ (సీవోజీ)ని ఫార్వర్డ్,లోయర్‌కి తీసుకొచ్చేలా ఇంధన ట్యాంక్ 1,000 mm మేర జరపబడింది.

విశాలమైన 12” వీల్స్,సముచిత వీల్‌బేస్ కలయిక గల సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110తో ట్రాఫిక్ రద్దీలో కూడా తక్కువ వేగాల్లోనూ ప్రయాణం సాఫీగా ఉండగలదు.
డిజైన్ సూత్రం
ఎర్గానామిక్స్ ప్రధానంగా టీవీఎస్ జూపిటర్ 110 డిజైన్ చేయబడింది. వివిధ జెండర్లు, పరిమాణాల్లోని రైడర్లకు అత్యంత సౌకర్యవంతంగా ఉండే విధంగా తగిన స్థానంలో అమర్చబడిన హ్యాండిల్‌బార్, విశాలవంతమైన ఫ్లోర్‌బోర్డ్, అందుబాటు స్థాయిలో సీటు ఎత్తు మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఆధునిక భారత వినియోగదారుల అభిరుచులను ప్రతిఫలించేలా స్టైలిష్ పియానో బ్లాక్ ఫినిష్, సిగ్నేచర్ ఇన్ఫినిటీ లైట్స్ వంటివి దీనికి అధునాతన హంగులను అద్దాయి. ఇందులో స్మార్ట్ అలర్ట్‌లు, యావరేజ్,రియల్ టైమ్ మైలేజీ ఇండికేటర్లతో కూడుకున్న ఫుల్లీ డిజిటల్ కలర్ ఎల్‌సీడీ స్పీడోమీటరు ఉంటుంది.
భద్రత ప్రమాణాలు
సరికొత్త టీవీస్ జూపిటర్ 110 భద్రత, సౌకర్యంపరంగా అత్యుత్తమ ఫీచర్లతో తీర్చిదిద్దబడింది. ఈ కింది పేర్కొన్న ఫీచర్లతో పాటు పలు ప్రత్యేకతలు ఉన్నాయి:

- మెటల్‌మ్యాక్స్ భరోసా – మెటల్ ఫ్యుయల్ ట్యాంక్, ఫ్రంట్ ఫెండర్, సైడ్ ప్యానెల్స్
- రెండు హెల్మెట్లు పట్టేలా డ్యుయల్ హెల్మెట్ స్పేస్
.ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్
.టర్న్ సిగ్నల్ ల్యాంప్ రీసెట్
.ఫాలో మీ హెడ్‌ల్యాంప్
డాన్ బ్లూ మ్యాట్, గెలాక్టిక్ కాపర్ మ్యాట్, టైటానియం గ్రే మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ గ్లోస్, లూనార్ వైట్ గ్లోస్,మిటియోర్ రెడ్ గ్లాస్ (Dawn Blue Matte, Galactic Copper Matte, Titanium Grey Matte, Starlight blue Gloss, Lunar White Gloss, Meteor Red Gloss) అనే ఆకర్షణీయమైన రంగుల్లో ఈ స్కూటరు లభిస్తుంది.
దీని ధర రూ. 77,100/- (ఎక్స్‌షోరూం, తెలంగాణ) నుంచి ప్రారంభమవుతుంది. ఇది అన్ని టీవీఎస్ఎం డీలర్‌షిప్‌లలో డ్రమ్, డ్రమ్ అలాయ్, డ్రమ్ ఎస్ఎక్స్‌సీ ,డిస్క్ ఎస్‌ఎక్స్‌సీ అనే 4 వేరియంట్లలో లభిస్తుంది.