ప్రపంచ మృత్తికా సదస్సులో పాల్గొన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 19,2024: అంతర్జాతీయ మృత్తికా శాస్త్ర సమాఖ్య పర్యవేక్షణలో, భారత మృత్తికాశాస్త్ర సంఘం, భారత వ్యవసాయ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 19,2024: అంతర్జాతీయ మృత్తికా శాస్త్ర సమాఖ్య పర్యవేక్షణలో, భారత మృత్తికాశాస్త్ర సంఘం, భారత వ్యవసాయ పరిశోధన మండలి,జాతీయ వ్యవసాయ శాస్త్ర అకాడమీ, న్యూఢిల్లీ సంయుక్తంగా “ఆహార భద్రత – నేలల సంరక్షణ,వాతావరణ మార్పుల నియంత్రణ – పర్యావరణ పరిరక్షణ” ప్రధానాంశంగా నిర్వహిస్తున్న ప్రపంచ వృత్తికా సదస్సు – 2024.
మంగళవారం నాడు న్యూఢిల్లీలో జాతీయ వ్యవసాయ శాస్త్ర అకాడమీ కాంప్లెక్స్ ప్రాంగణంలో నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ ముఖ్యఅతిథిగా, భారత వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర గౌరవ అతిథిగా వ్యవహరించగా భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్, భారత మృతికా శాస్త్ర సంఘం అధ్యక్షుడు డాక్టర్ హిమాన్షు పాతక్ అధ్యక్షతన సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది.
ఈ సదస్సుకు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి సుమారు 1500 మంది శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధన విద్యార్థులు, ప్రభుత్వ రంగ,ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ ఆధ్వర్యంలోని నేల ఆరోగ్య యాజమాన్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ K. పవన్ చంద్రా రెడ్డి (హైదరాబాద్ చాప్టర్ ప్రధాన కార్యదర్శి), డాక్టర్ M. శంకరయ్య శాస్త్రవేత్త, K. రాజమణి, అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్ట్ (పశుగ్రాసం) కు చెందిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ M. రాజేశ్వర్ నాయక్.
వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ కు చెందిన ప్రొఫెసర్లు/ ఆచార్యులు డాక్టర్ ఎస్. హరీష్ కుమార్ శర్మ, డాక్టర్ ఎం. శాంతి, డాక్టర్ ఎస్. శ్రీదేవి,పరిశోధన విద్యార్థులు సయేదా నాయర్ సుల్తానా, పి. అనూష, M. నిర్మిత రెడ్డి, మంజీత్ కౌర్, వి. సాయి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సదస్సులో శాస్త్రవేత్తలు,పరిశోధనా విద్యార్థులు పరిశోధనలు చేసిన వివిధ అంశాలపై పరిశోధనా పత్రాలు సమర్పిస్తారు. ఈ సదస్సులో హైదరాబాదులోని ఐ.సి.ఏ.ఆర్ ఆధ్వర్యంలోని వివిధ వ్యవసాయ పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు.