తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదకరంగా సెల్ఫీలు తీసుకున్న వ్యక్తులపై చర్యలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 1,2024: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కారును వేగంగా నడుపుతూ డోర్, రూఫ్ టాప్ నుంచి ప్రమాదకరంగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 1,2024: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కారును వేగంగా నడుపుతూ డోర్, రూఫ్ టాప్ నుంచి ప్రమాదకరంగా వేలాడుతూ సెల్ఫీలు తీసుకుని వెనుక వచ్చే వాహనదారులను ఇబ్బందులకు గురి చేసిన ఆరుగురు యువకులను తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నందకం విశ్రాంతి భవనం వద్ద ఆదివారం రాత్రి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సదరు వాహనాన్ని సీసీ కెమెరాలలో గుర్తించి వీరిని తిరుమల టూ టౌన్ పోలీసులకు అప్పజెప్పారు.

టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వ్యక్తులను విచారిస్తున్నారు.

కారు ప్రయాణంలో ప్రమాదకర విన్యాసాలు చేయకూడదని, అత్యంత వేగం కూడదని, ధార్మిక క్షేత్రంలో విచ్చలవిడిగా ప్రవర్తించడం పద్ధతి కాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలను అతిక్రమించడంతో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సంఘటన విచారించిన వారిలో తిరుమల 2 టౌన్ ci గారు శ్రీరాముడు, చలపతి, నాలుగవ సెక్టార్ vi నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.

About Author