శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు: ఫిబ్రవరి 6 నుంచి 12వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహణ
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల ఫిబ్రవరి 5,2025: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు ఘనంగా
![](https://varahimedia.com/wp-content/uploads/2025/02/SriGovindarajaswamy.jpg)
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల ఫిబ్రవరి 5,2025: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి.
ఈ ఉత్సవాలు ఏడు రోజుల పాటు సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు నిర్వహించబడతాయి. స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ, అనంతరం ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను ఆశీర్వదిస్తారు.
![](http://varahimedia.com/wp-content/uploads/2025/02/SriGovindarajaswamy.jpg)
ఫిబ్రవరి 6న శ్రీ కోదండరామస్వామి వారు, 7న శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు, 8న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు, 9న ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు, 10, 11, 12వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పలపై భక్తులకు కనువిందు చేయనున్నారు.
చివరి రోజు, తెప్పోత్సవం అనంతరం, ఎదురు ఆంజనేయస్వామివారి సన్నిధిలో స్వామివారు వేంచేపు చేస్తారు.