జనవరి 23న ముగియనున్న తిరుమల అధ్యయనోత్సవాలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 22,2025: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు జనవరి 23వ తేదీన ముగియనున్నాయి. గత ఏడాది
![](https://varahimedia.com/wp-content/uploads/2025/01/Adhyayanotsavalu.jpg)
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 22,2025: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు జనవరి 23వ తేదీన ముగియనున్నాయి. గత ఏడాది డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ అధ్యయనోత్సవాలు మొత్తం 25 రోజులు కొనసాగుతాయి.
ఈ సందర్భంగా, స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు ప్రతి రోజు గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదిస్తున్నారు. 25 రోజుల కాలంలో, ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను శ్రీవైష్ణవులు స్వామివారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పారాయణం చేస్తున్నారు.
![](http://varahimedia.com/wp-content/uploads/2025/01/Adhyayanotsavalu.jpg)
అధ్యయనోత్సవాల్లో, మొదటి 11 రోజులను పగల్పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజు కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజు రామానుజ నూట్రందాది, 24వ రోజు శ్రీ వరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజు తణ్ణీరముదు ఉత్సవంతో ఈ అధ్యయనోత్సవాలు వైభవంగా ముగుస్తాయి.