రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులను రప్పించేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 17,2024: పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో సమావేశం. విజయవాడలోని హోటల్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 17,2024: పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో సమావేశం. విజయవాడలోని హోటల్ వివంత్‌లో జరిగిన సమావేశంలో భాగంగా.సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఛైర్మన్ నూకసాని బాలాజి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఐఐ, ఎపీ ఛాంబర్స్ మద్దతుతో ఇన్వెస్టర్ల సమావేశం. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం ఉన్న అవకాశాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఇతర అధికారులు వివరించారు.పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వంపై ఉండే ప్రోత్సాహకాలను మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీ 2024పై చర్చనలుగొనటానికి ప్రతినిధులు. పర్యాటక పాలసీ 2024ను ఆవిష్కరించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.

విజయవాడలో పెట్టుబడిదారుల సమావేశంలో నూతన పాలసీని విడుదల చేసిన మంత్రి

మంత్రి కందుల దుర్గేష్

  • గతంలో పర్యాటక రంగం నిర్దాక్షిణ్యంగా ఉంది
  • పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు సరికొత్త పాలసీని తీసుకువచ్చాం
  • పర్యాటక రంగంలో 25,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్రంలో తీసుకురావడమే లక్ష్యం
  • పెట్టుబడిదారులకు పర్యాటక పాలసీ గురించి వివరించి, పెట్టుబడులు పెట్టాలని కోరాం
  • పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది పెట్టుబడిదారులు పెద్దఎత్తున ముందుకు రావడం ఆనందంగా ఉంది
  • పరిశ్రమలకు ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్నీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే ప్రాజెక్టులకు ఇస్తాం
  • రాష్ట్రం నలుమూలల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ అమలు చేస్తాం
  • కొత్తగా 50,000 రూములు అవసరమని, వాటిని సమకూర్చేందుకు పాలసీ అమలు చేస్తాం

About Author