“ఆర్థిక బలోపేతం కోసం కేశవ్ ముఖ్య మంత్రి సూచనలను అమలు చేయాలని పిలుపు”

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 11,2024: రాష్ట్రంలో ఆర్థిక శాఖ సంబంధిత సమస్యలు, లక్ష్యాలకు సంబంధించిన ప్రధాన విషయాలను ఈ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 11,2024: రాష్ట్రంలో ఆర్థిక శాఖ సంబంధిత సమస్యలు, లక్ష్యాలకు సంబంధించిన ప్రధాన విషయాలను ఈ సమావేశంలో వివరించడం జరిగింది.

ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ…ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ఈ సమావేశంలో చర్చిద్దాం.సీఎం చంద్రబాబు గారు ఇచ్చిన సూచనలు, సలహాల ప్రకారం కార్యక్రమాలను అమలు చేద్దాం.

1994 నుంచి అంటే దాదాపు 30 సంవత్సరాలుగా, సీఎం చంద్రబాబుతో ప్రయాణం చేస్తున్నాను.చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు ఎంత తపనతో పని చేశారో, ఇప్పుడు కూడా అదే కమిట్‌మెంట్‌తో ముందుకెళ్తున్నారు.ఆయన మిగిలిన జీవితాన్ని ప్రజల కోసమే, ప్రతి పనిలోనూ మానవత్వం ఉండాలని తపనతో పరిపాలన అందిస్తున్నారు.

చంద్రబాబుల వైఖరి, పనితీరు అందరికీ మార్గదర్శకంగా ఉంది.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారసత్వంగా వచ్చిన ప్రధాన సమస్య రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు.ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి నెలలో 99% రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే సరిపోయిన పరిస్థితి.

అంతకుముందు రెండు సంవత్సరాలు, 107% రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే వెచ్చించాల్సి వచ్చింది.రూ. 1 లక్ష 14 వేల కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాల్సి వచ్చింది.గత ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారు.

ఇటీవలి రెండు జిల్లాల్లో రివ్యూ నిర్వహించగా, వాస్తవ పరిస్థితులు చూసి చాలా బాధనిపిస్తోంది.రూ. 3 కోట్ల ఖర్చు పెడితే సరిపోతుందని, కానీ అలా కూడా చేయలేదు. దీనివల్ల కేసీ కెనాల్ గత ఐదేళ్లలో నాశనం అయింది.ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు, ఆగిపోయిన ప్రాజెక్టులు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు అన్నీ ఒకే సమయంలో ఎదురయ్యాయి.

మరొక వ్యక్తి అయితే నిద్రపోలేని పరిస్థితి, కానీ సీఎం చంద్రబాబు ప్రజాక్షేమమే ధ్యేయంగా కష్టపడుతున్నారు.నేను ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఈ స్థాయికి రావడం వెనుక సీఎం అందించిన ప్రోత్సాహమే.మనమంతా ఆయన అడుగుజాడల్లో పనిచేద్దాం.

ఆయన హైదరాబాద్‌ని ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేశారో గమనించండి.ఈ రాష్ట్రాన్ని కూడా మళ్లీ పరుగులు పెట్టించగలుగుతారు.10 యూనివర్సిటీలలో నేర్చుకోలేనిది ఒక చంద్రబాబు వద్ద నేర్చుకోవచ్చు.చంద్రబాబు వద్ద పనిచేయడం అంటే ఒక గొప్ప అవకాశం.

ప్రతి రూపాయి సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నాం.మిగిలిన శాఖలు కూడా ప్రతి రూపాయి ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి.ముఖ్యమంత్రి ఈ ఆరు నెలల్లో మూడు నెలలు తన డిన్నర్‌ను సెక్రటరియేట్‌లో చేసారు.

ఆయన ఎందుకు అంత కష్టపడుతున్నారు అంటే ప్రజలకు సేవ చేయాలి, పని చేయాలి అనే తపన.ఆయన పని చేసే విధానం చూసి, మనలో ఓ నమ్మకం ఏర్పడుతుంది.ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి మనవంతు పని చేద్దాం.

మన ముఖ్యమంత్రి టీమ్‌గా, ప్రజల కోసం పనిచేద్దాం. రాష్ట్ర ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చే పరిస్థితుల్లో మీరు ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుందాం అని పయ్యావుల కేశవ్ తెలిపారు.

About Author