భారత వ్యవసాయ అభివృద్ధి కోసం కోరమాండల్ ఇంటర్నేషనల్, IFDC భాగస్వామ్యం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 5,2024: భారతదేశంలోని ప్రముఖ అగ్రి-ఇన్‌పుట్ కంపెనీలలో ఒకటైన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 5,2024: భారతదేశంలోని ప్రముఖ అగ్రి-ఇన్‌పుట్ కంపెనీలలో ఒకటైన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సిఐఎల్), యుఎస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లాభాపేక్షలేని సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఫెర్టిలైజర్ డెవలప్‌మెంట్ సెంటర్ (IFDC)లు ఎరువుల అభివృద్ధిలో ఆవిష్కరణ,స్థిరత్వాన్ని పెంపొందించడా నికి వ్యూహాత్మక మాస్టర్‌ పరిశోధన ఒప్పందం పై సంతకం చేశాయి.

పోషక సామర్థ్యాన్ని పెంపొందించడం, పంటల ఉత్పాదకతను మెరుగుపరచడం, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా నూతన  ఎరువులను పరిచయం చేయడం ద్వారా వ్యవసాయంలో క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించే దిశగా ఈ భాగస్వామ్యం ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.

ఎరువుల పరిశోధన,ఉత్పత్తి సాంకేతికతలలో ఐ ఎఫ్ డి సి(IFDC) ప్రపంచ స్థాయి  నైపుణ్యంతో సిఐఎల్ విస్తృతమైన మార్కెట్ పరిధిని,అధునాతన ఆర్&డి సౌకర్యాలను ఈ ఒప్పందం కలిసి తీసుకువస్తుంది.

భాగస్వామ్య పరంగా కీలకప్రాంతాలు

విశాఖపట్నం, ఐఐటి బాంబే కోయంబత్తూరులో ఉన్న తమ మూడు అత్యాధునిక ఆర్&డి కేంద్రాలలో నూతన ,సమర్థవంతమైన ఎరువుల అభివృద్ధిని కోరమాండల్ ఇంటర్నేషనల్ చురుకుగా కొనసాగిస్తోంది.

ఈ ప్రయత్నాలు భారత మార్కెట్‌కు వినూత్న పరిష్కారాలను తీసుకురావడం,  భూసారాన్ని పెంపొందించడంతో పాటు ఉత్పాదకతను మెరుగుపరిచే అధునాతన ఉత్పత్తులతో రైతులను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

యుఎస్ఏ లోని అలబామాలోని మస్కిల్ షోల్స్‌లో అత్యాధునిక పరిశోధనా సౌకర్యాలతో అధునాతన ఎరువులు, సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో అగ్రగామిగా ఐ ఎఫ్ డి సి నిలిచింది. 

మరింత ముందుకు వెళ్తే, ఎరువుల ఆవిష్కరణ కోసం సహకార పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, భారతదేశంలో ఇలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఐ ఎఫ్ డి సి యోచిస్తోంది.

ఈ భాగస్వామ్యాన్ని  గురించి కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ  శ్రీ  ఎస్  శంకరసుబ్రమణియన్ మాట్లాడుతూ, “ రైతులకు తొలి ప్రాధాన్యత ఇచ్చే కంపెనీగా, భూసారాన్ని పెంపొందించే ,పంట ఉత్పాదకతను పెంచే ఆవిష్కరణలను చేయటానికి కోరమాండల్ పూర్తిగా కట్టుబడి ఉంది. 

ఐ ఎఫ్ డి సి తో ఈ మాస్టర్ రీసెర్చ్ ఒప్పందం పర్యావరణ  వ్యవసాయ పరిష్కారాల వైపు మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.

ఎరువుల అభివృద్ధి మరియు ఉత్పత్తి సాంకేతికతలలో ఐ ఎఫ్ డి సి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నైపుణ్యంతో మా ప్రయత్నాలను జోడించడం ద్వారా, ఉత్పాదకతను మెరుగుపరిచే రైతులకు ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించే ప్రభావవంతమైన ఆవిష్కరణలను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు. 

ఈ భాగస్వామ్యం గురించి ఐ ఎఫ్ డి సి ప్రెసిడెంట్, సీఈఓ హెంక్ వాన్ డుయిజ్న్ మాట్లాడుతూ,“భారతదేశం కోసం రూపొందించబడిన సమర్థవంతమైన, పర్యావరణపరంగా అనుకూలమైన ఎరువులను ఆవిష్కరించడానికి,అభివృద్ధి చేయడానికి కోరమాండల్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యం చేసుకోవటం పట్ల మేము సంతోషంగా ఉన్నాము.

అధిక వ్యవసాయ విస్తీర్ణం కలిగిన దేశంగా, ఐ ఎఫ్ డి సి కి అపారమైన ప్రాముఖ్యతను కలిగిన దేశంగా ఇండియా నిలిచింది. దేశంలో ఫెర్టిలైజర్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే మా ప్రణాళికలు కోరమాండల్ వంటి కంపెనీల సహకారంతో భారతదేశపు   ప్రత్యేకమైన వ్యవసాయ అవసరాలను తీర్చడానికి అంకితమైన పరిశోధనలను చేయాలనే మా నిబద్ధతను మరింత బలోపేతం చేస్తాయి..” అని అన్నారు. 

About Author