స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఆగస్టు 14,2024:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులందరికీ

హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, “మన దేశం స్వేచ్ఛను పొందేందుకు మహనీయులైన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించడం మన బాధ్యత.

వారి త్యాగాలపై నిలిచిన ఈ దేశం ప్రతీ భారతీయుడికి గర్వకారణం. స్వాతంత్ర్య స్ఫూర్తి మనకు ప్రేరణగా నిలుస్తుంది. అది మనను ముందుకు నడిపించే దిక్సూచి మాత్రమే కాదు, మన నిత్య జీవన గమనంలో ఒక అజస్ర శక్తి.”

ఆయన కొనసాగేలా, “మాతృదేశం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తపించాలి. ఈ స్ఫూర్తిని ప్రతి ఇంటికి చేరవేయాలన్న గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి ఆకాంక్షలో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని చేపట్టారు. మన ఇంటిపైనా జాతీయ పతకాన్ని ఎగురవేసి, దేశానికి వందనం సమర్పిద్దాం. గ్రామగ్రామాన తిరంగా వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలి. అందుకే రాష్ట్రంలోని పంచాయతీలకు తగిన నిధులను కేటాయించి, జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.”

స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రతి ఒక్కరూ మన మువ్వన్నెల జెండాను గర్వంగా ఎగురవేసి, త్యాగధనులను స్మరించండి.

About Author