యూఎస్‌ బాండ్‌ యీల్డుల తగ్గుదలతో జోరందుకున్నమార్కెట్లు.. నెల తర్వాత మళ్లీ 19,700కు నిఫ్టీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ సెప్టెంబర్ 7, 2023: భారత స్టాక్‌ మార్కెట్లు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాయి. వరుసగా ఐదో సెషన్లోనూ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ సెప్టెంబర్ 7, 2023: భారత స్టాక్‌ మార్కెట్లు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాయి. వరుసగా ఐదో సెషన్లోనూ లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు మధ్యాహ్నం నష్టాల్లోకి జారుకున్నాయి.

యూఎస్‌ బాండ్‌ యీల్డు, ముడి చమురు ధరలు తగ్గడం ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. దాంతో ఆఖరి అరగంటలోనే సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 116, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 385 పాయింట్లు లాభపడ్డాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసల బలహీనపడి 83.21 వద్ద స్థిరపడింది. ఎకానమీ బలహీనపడటంతో చైనా, హాంకాంగ్‌, కొరియా మార్కెట్లు నష్టపోయాయి. జర్మనీ ద్రవ్యోల్బణం డేటా ఆందోళనకు గురి చేయడం తో ఐరోపా మార్కెట్లు విలవిల్లాడు తున్నాయి.

గురువారం 65,854 వద్ద మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మధ్యాహ్నం 65,672 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో పుంజుకొని 66,296 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 385 పాయింట్ల లాభంతో 66,265 వద్ద ముగిసింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,598 వద్ద ఓపెనైంది. 19,550 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,737 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 116 పాయింట్లు పెరిగి 19,727 వద్ద క్లోజైంది.

ఆగస్టు 1 తర్వాత సూచీలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. ఇక బ్యాంకు నిఫ్టీ 469 పాయింట్లు ఎగిసి 44,878 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50 అడ్వాన్స్‌ డిక్లైన్ రేషియో 34:16గా ఉంది. కోల్‌ ఇండియా (6.92%), ఎల్‌టీ (4.24%), ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ (2.08%), ఎస్బీఐ లైఫ్‌ (1.80%), ఎస్బీఐ (1.77%) టాప్‌ గెయినర్స్‌.

టాటా కన్జూమర్‌ (2.27%), ఓఎన్జీసీ (0.98%), బ్రిటానియా (0.90%), ఎం అండ్‌ ఎం (0.77%), సన్‌ఫార్మా (0.732%) టాప్‌ లాసర్స్‌. ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగాల సూచీలు నష్టపోగా.. బ్యాంకు, ఫైనాన్స్‌, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.

నిఫ్టీ సెప్టెంబర్‌ టెక్నికల్‌ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,800 వద్ద రెసిస్టెన్సీ, 19,650 వద్ద బలమైన సపోర్ట్‌ ఉన్నాయి. ఇన్వెస్టర్లు నియర్‌ టర్మ్‌లో యూబీఎల్‌, టాటా మోటార్స్, బజాజ్‌ ఆటో, ఎల్‌టీ, జీఎస్‌పీఎల్‌, హెచ్‌డీఎఫ్సీ లైఫ్‌ షేర్లలో పెట్టుబడి పెట్టొచ్చు.

వాల్యుయేషన్లు ఎక్కువగా ఉన్నా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు రికార్డు గరిష్ఠాలను తాకాయి. ఆర్డర్లు రావడంతో ఎల్‌టీ షేరు 4 శాతం పెరిగింది. డిమాండ్ పెరుగుదలతో పవర్‌ కంపెనీల షేర్లు పరుగులు పెడుతున్నాయి.

హల్దీరామ్స్‌లో వాటా కొనుగోలు వార్తలు అవాస్తమని చెప్పడంతో టాటా కన్జూమర్‌ షేరు పడిపోయింది. సిమెంటు కంపెనీల్లో ప్రాఫిట్‌ బుకింగ్‌ కనిపించింది. కొత్త సీఈవో నియామకంతో యూబీఎల్‌ షేరు ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరింది. బిజినెస్‌ డేటా ఆశావహంగా ఉండటంతో మాక్స్‌ ఫైనాన్స్‌, ఎస్బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు పెరిగాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్టీ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709.

About Author