ZEE5 మనోరంజన్ ఫెస్టివల్: మార్చి నెలంతా ఉచితంగా బ్లాక్‌బస్టర్ వినోదం!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 11,2025: దేశీయ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ZEE5 వినోద ప్రియుల కోసం మరోసారి అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. మార్చి 1 నుంచి 30 వరకు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 11,2025: దేశీయ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ZEE5 వినోద ప్రియుల కోసం మరోసారి అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. మార్చి 1 నుంచి 30 వరకు ‘ZEE5 మనోరంజన్ ఫెస్టివల్’ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ఫెస్టివల్ సందర్భంగా అనేక బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు, కామెడీ ఎంటర్టైన్మెంట్, హై-ఆక్టేన్ యాక్షన్ సినిమాలు, ఎమోషనల్ డ్రామాలను ఉచితంగా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది.

Read this also…SBI Expands Nationwide, Strengthens Financial Inclusion with 70 New Branches & 501 Women CSPs

Read this also…NSE Clearing Ltd Retains “CRISIL AAA/Stable” Rating for the 17th Consecutive Year

ఈ ఫెస్టివల్‌లో భాగంగా హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, పంజాబీ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు అందుబాటులో ఉంటాయి. రక్షా బంధన్, హడ్డీ, కిసీ కా భాయ్ కిసీ కా జాన్, ఉంచాయ్, కడక్ సింగ్, ఖుదా హాఫిజ్ చాప్టర్ 2, అటాక్ పార్ట్ 1, లవ్ హాస్టల్, ఛత్రివాలి, ఖిచ్డి 2 వంటి హిందీ చిత్రాలు, అలాగే యానై, విక్రమ్ (తమిళం), సూపర్ శరణ్య, ఇని ఉత్తరం, ప్రణయ విలాసం, క్వీన్ ఎలిజబెత్ (మలయాళం), భాంగ్రా పౌండే నే (పంజాబీ), ఘోస్ట్ (కన్నడ) సినిమాలు ఉచితంగా ప్రసారం కానున్నాయి.

ఈ సందర్భంగా ZEE5 ప్రతినిధి మాట్లాడుతూ, “ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి వినోదాన్ని అందించడమే మా లక్ష్యం. ZEE5 మనోరంజన్ ఫెస్టివల్ ద్వారా లక్షలాది మంది ఉచితంగా ప్రీమియం కంటెంట్‌ను ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తున్నాం.

‘హర్ స్క్రీన్ రంగీన్’ కాన్సెప్ట్‌తో మార్చి నెలంతా ఇంట్లోనే టాప్ క్లాస్ సినిమాలు చూసేలా మా ప్రయత్నం. ఈ హోలీ సీజన్‌ను మరింత రంగులమయం చేసేలా కుటుంబం మొత్తం కలిసి ZEE5 ద్వారా ఎంటర్టైన్మెంట్‌ను ఆస్వాదించండి” అని తెలిపారు.

Read this also…ZEE5 Manoranjan Festival Returns: A Month of Free Blockbusters & Festive Entertainment!

ఇది కూడా చదవండి…ఫ్యాషన్, టెక్నాలజీ & వినోదం కలయికతో వైజాగ్‌లో అద్భుతంగా ముగిసిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

ZEE5 ప్రస్తుతం దేశంలోని అగ్రశ్రేణి మల్టీలాంగ్వేజ్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌గా నిలుస్తోంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాళీ సహా 12 భాషల్లో వినోదాన్ని అందిస్తోంది. 3,500కి పైగా సినిమాలు, 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్‌తో పాటు 5 లక్షల గంటలకుపైగా కంటెంట్‌ను కలిగి ఉంది.

అంతేకాకుండా ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోలు, మ్యూజిక్, కిడ్స్ ఎంటర్టైన్మెంట్, న్యూస్, లైవ్ టీవీ, ఎడ్యుటైన్‌మెంట్‌ వంటి విభాగాల్లోనూ వినోదాన్ని పంచుతోంది.

ZEE5 మనోరంజన్ ఫెస్టివల్‌ను ఆస్వాదించేందుకు ఇప్పుడే ZEE5 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. మార్చి 30 వరకు ఈ ప్రత్యేక ఫెస్టివల్ కొనసాగనుంది.

About Author