వాట్సాప్ స్కామ్: 43 లక్షల మోసం.. మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా..?
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 20,2023:ముంబైలోని ఓ వ్యక్తి వాట్సాప్‌లో మోసానికి గురయ్యాడు, దాని కారణంగా ఓ వ్యక్తి రూ. 43.45 లక్షలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 20,2023:ముంబైలోని ఓ వ్యక్తి వాట్సాప్‌లో మోసానికి గురయ్యాడు, దాని కారణంగా ఓ వ్యక్తి రూ. 43.45 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆన్‌లైన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పగా నమ్మి మోసపోయాడు.
సోషల్ మీడియా, వాట్సాప్ లలో సైబర్ స్కామ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు వాట్సాప్‌లో రూ.43 లక్షలు మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఓ వ్యక్తి వాట్సాప్‌లో మోసానికి గురయ్యాడు. దాని కారణంగా అతను రూ. 43.45 లక్షలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే..?

వాట్సాప్ స్కామ్ జరిగింది.. ఇలా..
ముంబైకి చెందిన 33 ఏళ్ల వ్యక్తి ఆన్‌లైన్ లో డబ్బులు ఇస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ సందేశాన్ని అందుకున్నాడు. దురాశతో వారు చెప్పిన మాటలు విని రూ.43.45 లక్షల మేర మోసపోయాడు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 420 కింద మోసగాళ్లపై కేసు నమోదు చేశారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.