వనజీవి’ రామయ్య స్ఫూర్తిని జీవింపజేస్తాం: పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 12, 2025: ఆరు దశాబ్దాల పాటు పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించి, దాదాపు కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ ‘వనజీవి’

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 12, 2025: ఆరు దశాబ్దాల పాటు పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించి, దాదాపు కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
ఇది కూడా చదవండి..జ్యువెల్స్ ఆఫ్ ఇండియా 10వ ఎడిషన్ ను ఆవిష్కరించిన రిలయన్స్ జ్యువెల్స్
Read this also…Reliance Jewels Unveils 10th edition of ‘Jewels of India – Tirupati collection’ for Akshaya Tritiya
‘వృక్షో రక్షతి రక్షితః’ అనే పెద్దల వాక్యాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేసేందుకు రామయ్య చేసిన కృషి సమాజానికి అనిర్వచనీయమైన ఉపకారం చేసింది. తొలకరి వర్షం కురిసినప్పుడల్లా మొక్కలు నాటి, విత్తనాలు చల్లి హరిత వనాన్ని సృష్టించిన రామయ్య, ఆయన సతీమణితో కలిసి నిర్వహించిన వృక్ష యజ్ఞం భావి తరాలకు స్వచ్ఛమైన గాలిని, పర్యావరణాన్ని అందించనుంది.

ఇది కూడా చదవండి..వృషభ మూవీ రివ్యూ & రేటింగ్: విభిన్న కథా నేపథ్యంతో ప్రేక్షకుల మన్ననలు పొందిన సినిమా!
ఇది కూడా చదవండి..త్రైమాసిక, పూర్తి సంవత్సరంవారీగా అత్యధిక బుకింగ్స్ నమోదు చేసిన గోద్రెజ్ ప్రాపర్టీస్
గతంలో రామయ్యకి ఓ సందర్భంలో ప్రమాదం జరిగినప్పుడు ఆస్పత్రిలో ఉండగా ఆయనను కలిశాను. ఆ సమయంలోనూ ఆయన మనసు పర్యావరణ సంరక్షణ గురించే ఆలోచిస్తూ ఉండేది. రామయ్య ఆదర్శాలను కొనసాగిస్తూ, పచ్చదనాన్ని విస్తరించేందుకు కృషి చేయడమే కాక, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసే దిశగా అడుగులు వేస్తాము. ‘వనజీవి’ రామయ్య గారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.