నవరాత్రి సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్‌లో 131 కార్లను డెలివర్ చేసిన ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్,15 అక్టోబర్, 2024: ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, తమ అత్యంత ప్రజాదరణ పొందిన కార్లకు సంబంధించి, తెలంగాణలోని హైదరాబాద్ లో మెగా

డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్,15 అక్టోబర్, 2024: ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, తమ అత్యంత ప్రజాదరణ పొందిన కార్లకు సంబంధించి, తెలంగాణలోని హైదరాబాద్ లో మెగా డెలివరీలను ప్రకటించింది. నవరాత్రి పర్వదినాన, బ్రాండ్ తమ కస్టమర్లకు 131 కార్లను అందించి, ఫోక్స్‌వ్యాగన్ పై ఉన్న విశ్వసనీయత,బ్రాండ్ ఆకర్షణను ప్రదర్శించింది.
ఈ మెగా డెలివరీ, తెలంగాణ మార్కెట్లో కస్టమర్లకు అసాధారణ అనుభూతిని అందించడం లో బ్రాండ్‌కి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది.ఫోక్స్‌వ్యాగన్, ఆమోదయోగ్యతను ప్రదర్శిస్తుంది.

భారత్‌లో పండుగ సీజన్ ప్రారంభమవ్వడంతో, ఫోక్స్‌వ్యాగన్ తన వార్షిక ఫెస్టివ్ వేడుక ‘ఫోక్స్‌ఫెస్ట్’ ద్వారా కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా, పరిమిత కాలం పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు,ప్రయోజనాలను అందిస్తోంది. దాదాపు ఒకటిన్నర దశాబ్దం పైగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫోక్స్‌వ్యాగన్, కస్టమర్లకు థ్రిల్లింగ్ డ్రైవింగ్ అనుభూతిని అందించడానికి ప్రఖ్యాతి గాంచిన కార్లను అందిస్తోంది.
ఫోక్స్‌ఫెస్ట్ 2024 ద్వారా, పండుగ వేడుకలను దేశవ్యాప్తంగా 14 ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలలోని మాల్స్‌లో ప్రత్యేక యాక్టివిటీస్,ఈవెంట్ల రూపంలో కస్టమర్లకు మరింత చేరువ చేస్తోంది.
ఈ ఏడాది అక్టోబర్‌లో, ఫోక్స్‌వ్యాగన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వర్టూస్ జీటీ లైన్, వర్టూస్ జీటీ ప్లస్ స్పోర్ట్‌ను కూడా లాంచ్ చేసింది. విశిష్టమైన బ్లాక్ థీమ్ స్టయిల్‌తో రూపకల్పన చేయబడిన ఈ రెండు వేరియంట్లు కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటాయి. ఈ క్రమంలో, టైగన్ జీటీ లైన్‌కు మరింత మెరుగుపరచబడిన ఫీచర్ ప్యాకేజీని కూడా బ్రాండ్ ప్రవేశపెట్టింది.

మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.volkswagen.co.in.