విష్ణు వర్ధన్ రెడ్డి స్పందన: ఢిల్లీ విజయంపై హర్షం – కేజ్రీవాల్, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఫిబ్రవరి 8,2025: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మాట్లాడుతూ, “27 ఏళ్ల తర్వాత ఢిల్లీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఫిబ్రవరి 8,2025: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మాట్లాడుతూ, “27 ఏళ్ల తర్వాత ఢిల్లీ ప్రజలు గొప్ప విజయాన్ని అందించారు” అని హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ బీజేపీకి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేసే అవకాశం కల్పించిన ఢిల్లీ ప్రజలకు ఏపీ బీజేపీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
బీహార్ గెలుపు లక్ష్యం
ఈ విజయం ఢిల్లీ వరకు మాత్రమే పరిమితం కాకుండా త్వరలో బీహార్‌లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
టీడీపీ, జనసేన మద్దతు
డిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీతో పాటు టీడీపీ, జనసేన నేతలు కూడా కీలక పాత్ర పోషించారని, ముఖ్యంగా నేరుగా ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కేజ్రీవాల్‌పై విమర్శలు
*దేశ చరిత్రలో అవినీతి మరకలు అంటుకున్న నేత కేజ్రీవాల్ అని ఆరోపించారు.
*లిక్కర్ స్కామ్‌లో జైలుకెళ్లినా, తన పదవిని విడిచిపెట్టకుండా సీఎం పదవే ముఖ్యమని భావించడం ప్రజాస్వామ్యానికి అర్థం లేనిది అని మండిపడ్డారు.
*తెలుగు రాష్ట్రాలతో లిక్కర్ స్కామ్‌కు ఉన్న సంబంధాలు కూడా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయని పేర్కొన్నారు.
*లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లను ప్రజలు తిప్పికొట్టారు అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఓటమి – రాహుల్ గాంధీపై సెటైర్లు
*కాంగ్రెస్ ఒక్క సీటును కూడా గెలవలేకపోవడంతో, ఆ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాను కోల్పోయింది.
*ఈ ఘోర ఓటమికి రాహుల్ గాంధీ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.

ఆప్ పార్టీపై తీవ్ర విమర్శలు
*దేశంలో అహంకారపూరితమైన, అవినీతిమయమైన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని విమర్శించారు.
*కుంభమేళా గురించి అవహేళన చేస్తూ మాట్లాడిన ఆప్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు అని వ్యాఖ్యానించారు.
*దేశ రాజకీయాల్లో ఆప్ పార్టీ మునిగిపోయే నావే అని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు
ఈ విజయం సాధించడంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం ఎంతో కీలకంగా మారిందని పేర్కొంటూ, ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.