“తెలంగాణలో డేటా స్పీడ్,కవరేజ్‌ను పెంచేందుకు Vi భారీగా ఇన్వెస్ట్”
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 26, 2024 :దిగ్గజ టెలికం కంపెనీ అయిన వీ (Vi) తెలంగాణలోని తమ నెట్‌వర్క్ సామర్ధ్యాన్ని అప్‌గ్రేడ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 26, 2024 :దిగ్గజ టెలికం కంపెనీ అయిన వీ (Vi) తెలంగాణలోని తమ నెట్‌వర్క్ సామర్ధ్యాన్ని అప్‌గ్రేడ్ చేసినట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని 4,000 పైచిలుకు సైట్లలో LTE 2500 MHz బ్యాండ్‌లో స్పెక్ట్రంను 10 MHz నుంచి 20 MHzకి అప్‌గ్రేడ్ చేసింది. తద్వారా ఈ లేయర్‌లో నెట్‌వర్క్ సామర్ధ్యాన్ని రెట్టింపునకు పెంచుకుంది.
హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, అదిలాబాద్, సూర్యాపేట, మిర్యాలగూడా, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి తదితర నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అప్‌గ్రేడ్‌తో వీ గిగానెట్ నెట్‌వర్క్‌పై కస్టమర్లు మరింత వేగవంతమైన డేటా స్పీడ్‌ను అనుభూతి చెందగలరు.
“నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్ చేయడం, తమ యూజర్లకు మెరుగైన వేగం మరియు విశ్వసనీయతను అందించాలన్న వీ విస్తృత వ్యూహానికి అనుగుణంగా ఈ స్పెక్ట్రం అప్‌గ్రేడ్ చేపట్టబడింది. ఇటీవల 900 MHz బ్యాండులో కొనుగోలు చేసిన 2.4 MHzను కూడా వినియోగంలోకి తేవడం ద్వారా రాబోయే రోజుల్లో మా నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోవడాన్ని కొనసాగిస్తాం” అని వొడాఫోన్ ఐడియా క్లస్టర్ బిజినెస్ హెడ్ (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ, కర్ణాటక) ఆనంద్ డానీ (Anand Dani) తెలిపారు.
డిజిటల్ ప్రపంచంలో తమ కస్టమర్లు ముందుకెళ్లేలా వారి కోసం వీ సరికొత్త ఆఫర్లు, ప్లాన్లను కూడా ప్రవేశపెట్టింది. తెలంగాణలో ఇటీవల ప్రవేశపెట్టిన వాటిల్లోవి కొన్ని:
● వీ గ్యారంటీ ప్రోగ్రాం: వీ యాప్ ద్వారా ఆప్ట్ ఇన్ చేసుకున్నాక, వరుసగా 13 రీచార్జ్ సైకిల్స్‌లో ప్రతి 28 రోజులకు ఆటోమేటిక్‌గా 10 జీబీ క్రెడిట్ కావడం ద్వారా వీ కస్టమర్లకు ఏడాది వ్యవధిలో గ్యారంటీగా 130GB అదనపు డేటా లభిస్తుంది. 5జీ స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారు లేక రూ. 299 అంతకు మించిన రోజువారీ డేటా అన్‌లిమిటెడ్ ప్యాక్‌తో కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌కు ఇటీవల అప్‌గ్రేడ్ అయిన వీ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
● RED X కింద కొత్తగా రూ. 1,201 నెలవారీ రెంటల్‌తో ప్రవేశపెట్టిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో నాన్-స్టాప్ సర్ఫింగ్, స్ట్రీమింగ్, కనెక్టివిటీ కోసం అపరిమిత డేటా పొందవచ్చు. దీనితో అన్ని వీ టచ్‌పాయింట్స్‌వ్యాప్తంగా ప్రయారిటీ కస్టమర్ సర్వీస్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, 6 నెలల స్విగ్గీ వన్ మెంబర్‌షిప్, 7 రోజుల ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ వంటి కాంప్లిమెంటరీ ఆఫర్లకు సబ్‌స్క్రయిబ్ చేసుకునేందుకు కస్టమర్లకు అవకాశం లభిస్తుంది.
● ఓటీటీ ప్లాట్‌ఫాంలు ప్రాచుర్యం పొందుతున్న క్రమంలో, మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటు ధరల్లో అందించాలన్న వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా వీ మూవీస్ & టీవీ యాప్, ఇప్పుడు ఒకే సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌తో 17 వరకు ఓటీటీ ప్లాట్‌ఫాంలు, 350 వరకు లైవ్ టీవీ ఛానల్స్‌ను అందిస్తోంది. ఇటీవలే నెలకు రూ. 248 ధరతో వీ మూవీస్ అండ్ టీవీ ప్లస్‌ను, నెలకు రూ. 154 ధరతో వీ మూవీస్ అండ్ టీవీ లైట్ అనే రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను కొత్తగా ప్రవేశపెట్టింది.
● కంటెంట్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వీ ఇప్పుడు రెండు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లతో – రూ. 1,198కే 70 రోజులు, రూ. 1,599కే 84 రోజులు – నెట్‌ఫ్లిక్స్‌కు యాక్సెస్ అందిస్తోంది. 12 am – 6 am మధ్య అపరిమిత డేటా, వీకెండ్ డేటా రోలోవర్, డేటా డిలైట్ వంటి ఫీచర్లతో ఈ ప్యాక్‌లు వినియోగదారులకు హీరో అన్‌లిమిటెడ్ యొక్క ప్రయోజనాలను అందిస్తాయి.