ఐపీవో కోసం సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన వెరిటాస్ ఫైనాన్స్ లిమిటెడ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 27,2025: రిటైల్ ఆధారిత నాన్-డిపాజిట్ టేకింగ్ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ వెరిటాస్ ఫైనాన్స్ లిమిటెడ్, తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 27,2025: రిటైల్ ఆధారిత నాన్-డిపాజిట్ టేకింగ్ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ వెరిటాస్ ఫైనాన్స్ లిమిటెడ్, తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కు సంబంధించి సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ను సమర్పించింది.

ఈ పబ్లిక్ ఆఫర్‌ మొత్తం రూ. 2,800 కోట్ల వరకు ఉండగా, ఇందులో రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజా జారీగా (ఫ్రెష్ ఇష్యూ),రూ. 2,200 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నారు. ఒక్కో ఈక్విటీ షేరు ముఖ విలువ రూ. 10గా నిర్ణయించారు.

ఆఫర్ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్ వ్యాపార అవసరాలకు అనుగుణంగా మూలధన బేస్‌ను పెంపొందించేందుకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే, అర్హత కలిగిన ఉద్యోగులకు పబ్లిక్ ఇష్యూలో కొంత భాగం కేటాయించనున్నారు.

బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లతో సంప్రదింపుల మేరకు, రూ. 120 కోట్ల వరకు విలువైన షేర్ల ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్‌ను కూడా కంపెనీ చేపట్టవచ్చు.

ఆఫర్ ఫర్ సేల్ వివరాలు
ఇన్వెస్టర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్ల ద్వారా రూ. 2,200 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.

నార్‌వెస్ట్ వెంచర్ పార్ట్‌నర్స్ X – మారిషస్: రూ. 550 కోట్లు
కేదారా క్యాపిటల్ ఫండ్ II LLP: రూ. 550 కోట్లు
బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ పీఎల్‌సీ: రూ. 500 కోట్లు
లోక్ క్యాపిటల్ గ్రోత్ ఫండ్: రూ. 425 కోట్లు
గ్రోత్ క్యాటలిస్ట్ పార్ట్‌నర్స్: రూ. 75 కోట్లు
విభిన్న వ్యక్తిగత షేర్‌హోల్డర్ల ద్వారా మరో రూ. 100 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.

విద్యా అరుల్మణి: రూ. 36 కోట్లు
పి. సురేంద్ర పాయ్: రూ. 21 కోట్లు
సవితా ఎస్. పాయ్: రూ. 21 కోట్లు
షీలా పాయ్: రూ. 14 కోట్లు
మనీషా శరద్ గాంధీ: రూ. 8 కోట్లు

2015లో స్థాపించబడిన వెరిటాస్ ఫైనాన్స్ లిమిటెడ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టానికి అనుగుణంగా పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రధానంగా ఎంఎస్ఎంఈలు, స్వయం ఉపాధి పొందిన వ్యక్తులకు చిన్న వ్యాపార రుణాలను అందించడం ద్వారా గుర్తింపు పొందింది.

ఇటీవల ఈ సంస్థ గృహ రుణాలు, వాడిన వాణిజ్య వాహన రుణాలు అందించడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించింది. 2022 నుంచి 2024 మధ్య కాలంలో 61.76% సమగ్ర వృద్ధి రేటుతో (సీఏజీఆర్) అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఎన్‌బీఎఫ్‌సీగా ఇది గుర్తించనుంది.

ఈ ఇష్యూకి ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, జెఫ్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఈక్విటీ షేర్లను బిఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో లిస్టింగ్ చేయాలని ప్రణాళిక ఉంది.

About Author