చెట్లే మనిషి ఆనవాళ్లు: వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అనంతవరం, జూన్ 5,2025: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం అనంతవరం గ్రామంలో వన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అనంతవరం, జూన్ 5,2025: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం అనంతవరం గ్రామంలో వన మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి,అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హాజరై మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “మనం చిన్నతనంలో ఇంటి చిరునామా చెట్ల పేర్లతో గుర్తుపెట్టుకునే వాళ్లం. చెట్లు మనిషి జీవనపరిచయాన్ని తెలిపే ఆనవాళ్లు. వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అన్నారు. గతంలో వ్యక్తిగతంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేశానని, ఇకపై సమాజ స్థాయిలో దానిని విస్తరింపజేస్తానని పేర్కొన్నారు.

Read This also…SAMCO Mutual Fund Launches India’s First Momentum-Based Large & Mid Cap Fund..

Read This also…Guru Nanak University Partners with Intellipaat to Launch Industry-Driven B.Tech Programs in Hyderabad

Read This also…Chaurya Paatham: Crime Meets Comedy in a Rural Heist Gone Wrong..

మొక్కల నాటే కార్యక్రమాన్ని పెద్ద స్థాయిలో తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒక్కరోజులో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించామని, వచ్చే ఏడాది కాలంలో ఐదు కోట్ల మొక్కల నాటే లక్ష్యాన్ని అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 50% పచ్చదనం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని వెల్లడించారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత. పర్యావరణంపై అవగాహన కలిగిన ప్రభుత్వంగా, పచ్చదనాన్ని పెంపొందించడమే మా ప్రధాన ధ్యేయం. గతంలో ‘నీరు–చెట్టు’ వంటి విజయవంతమైన కార్యక్రమాలు చేర్చిన అనుభవంతో మరిన్ని అడుగులు వేస్తాం” అన్నారు.

నల్లమల అడవుల పరిరక్షణ కోసం మూడు దశాబ్దాలుగా పని చేసిన కొమ్మిర అంకారావు సేవలను గుర్తిస్తూ, ఆయనను రాష్ట్ర అటవీశాఖ సలహాదారుగా నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. “అడవుల పెంపకమే కాదు, కార్చిచ్చుల నివారణకు కూడ చర్యలు తీసుకుంటాం. గొర్రెల కాపర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య, అమరావతి అభివృద్ధి బోర్డు ఛైర్మన్ లక్ష్మీ పార్థసారధి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, పీసీసీఎఫ్ ఏ.కె. నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author