టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన కాప్ యాక్షన్ డ్రామా చిత్రం ‘నరివెట్ట’..
వాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 2,2025: మలయాళ హీరో టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన కాప్ యాక్షన్ డ్రామా చిత్రం ‘నరివెట్ట’ మలయాళంలో ఘనవిజయం సాధించింది.

వాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 2,2025: మలయాళ హీరో టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన కాప్ యాక్షన్ డ్రామా చిత్రం ‘నరివెట్ట’ మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో టొవినో థామస్ నటనకు విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న టొవినో, తెలుగు ప్రేక్షకులకూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
తన సున్నితమైన ఎమోషనల్ సీన్లతో ప్రేక్షకుల్ని చలించేసిన ఈ సినిమాకు, టొవినో తన సోషల్ మీడియాలో స్పందిస్తూ అభిమానుల అభిప్రాయాలను పంచుకున్నాడు. మలయాళంలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ‘నరివెట్ట’ను త్వరలోనే తెలుగులో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్స్ గ్రాండ్గా రిలీజ్ చేయనుంది. ఇటీవల ‘ఐడెంటిటీ’ సినిమాలో తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న టొవినో, ఇప్పుడు పోలీస్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాతో మరింత ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు.
అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అబిన్ జోసెఫ్ నిర్మించారు. సినిమాలో సురాజ్ వెంజరమూడు, చెరణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా, సంగీతాన్ని జేక్స్ బిజోయ్ అందించారు.