ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బందికి బెదిరింపు కాల్స్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 9,2024: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బందికి ఏకంగా ఆగంతకుడు బెదిరింపు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 9,2024: ఉప ముఖ్యమంత్రి పవన్ క ల్యాణ్ కార్యాలయ సిబ్బందికి ఏకంగా ఆగంతకుడు బెదిరింపు కాల్స్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. “చంపేస్తామని” అంటూ తీవ్రంగా హెచ్చరించిన ఆగంతకుడు, ఆ తర్వాత అభ్యంతకరమైన భాషలో మెసేజులు కూడా పంపించాడు.
ఈ బెదిరింపు కాల్స్,మెసేజులను పేషీ సిబ్బంది ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని పేషీ అధికారులు వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు.
#PawanKalyan, #DeputyChiefMinister, #ThreatCalls,#SecurityAlert, #TelanganaNews, #PoliticalUpdates, #SafetyConcerns, #PoliceInvestigation, #BreakingNews, #HyderabadNews,