రైతులకు తక్కువ ధరకే యూరియా అందించనున్న కేంద్ర సర్కారు..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగష్టు 15,2023: అన్నదాతలకు తక్కువ ధరకే యూరియా అందించనున్నదికేంద్ర సర్కారు. అందుకోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగష్టు 15,2023: అన్నదాతలకు తక్కువ ధరకే యూరియా అందించనున్నదికేంద్ర సర్కారు. అందుకోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లనుకేటాయించింది.

ఇదే విషయాన్ని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. రైతులకు యూరియా రాయితీ కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించామని చెప్పారు.

ప్రపంచ మార్కెట్‌లో రూ.3000 ధర ఉన్న యూరియాను రైతులకు రూ.300 చొప్పున, అతి తక్కువ ధరకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లను యూరియా రాయితీగా కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.

“కొన్ని ప్రపంచ దేశాల్లో రూ.3,000కు విక్రయించే యూరియా బస్తాను రూ.300 ధరకు అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇందుకోసం యూరియాపై రూ.10 లక్షల కోట్ల రాయితీని అందిస్తోంది” అని ప్రధాన మంత్రి ఎర్రకోట పైనుంచి ప్రధాని మోదీ చెప్పారు.

About Author