హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ‘ది బేర్ హౌస్’ కొత్త స్టోర్ ప్రారంభం..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 7, 2025: స్మార్ట్ కాజువల్స్‌కు గుర్తింపు తెచ్చుకున్న పురుషుల ఫ్యాషన్ బ్రాండ్ ది బేర్ హౌస్ తమ రెండవ ప్రత్యేక ఆఫ్‌లైన్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 7, 2025: స్మార్ట్ కాజువల్స్‌కు గుర్తింపు తెచ్చుకున్న పురుషుల ఫ్యాషన్ బ్రాండ్ ది బేర్ హౌస్ తమ రెండవ ప్రత్యేక ఆఫ్‌లైన్ స్టోర్‌ను హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ఘనంగా ప్రారంభించింది. ఇటీవల ప్రసారమైన షార్క్ ట్యాంక్ సీజన్ 4లో ఈ బ్రాండ్ బాగా హైలైట్ అయింది. thebearhouse.com

హైదరాబాద్‌లో ఇప్పటికే బ్రాడ్‌వేలో స్టోర్ నిర్వహిస్తున్న ది బేర్ హౌస్, ఇప్పుడు ప్రీమియం షాపింగ్ గమ్యస్థానం అయిన బంజారా హిల్స్‌లో 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త స్టోర్‌తో వినియోగదారులకు మరింత చేరువైంది. ఈ స్టోర్ బ్రాండ్‌కు తొలి హై-స్ట్రీట్ కమ్ మాల్ అవుట్‌లెట్‌గా నిలిచింది.

ఇది కూడా చదవండి...‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న విల‌క్ష‌ణ న‌టుడు శివాజీ

Read this also…NSE Academy & Thunderbird ASU Partner for Global Leadership Programs

బెంగళూరులోని ది బేర్ హౌస్ స్టోర్ లే అవుట్‌కు ప్రతిరూపంగా రూపొందించిన ఈ స్టోర్, ‘బేర్ కేవ్’ కాన్సెప్ట్‌తో వినూత్నమైన మట్టి వాసనలతో, సహజమైన రంగులతో ఆకట్టుకుంటోంది.

స్టోర్‌లో ప్రత్యేకంగా:

  • షర్టులు
  • బాటమ్స్
  • పోలోస్
  • స్వెట్‌షర్టులు
  • డెనిమ్స్
  • యాక్సెసరీస్
    లాంటివి ప్రదర్శించబడతాయి. ఇవన్నీ శైలి, సౌకర్యం కోరుకునే ప్రయాణప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

ఈ సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు హర్ష్ సోమయ్య మాట్లాడుతూ,“హైదరాబాద్‌లో మా ఆన్‌లైన్ అమ్మకాలు అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా అదే స్థాయిని కొనసాగించాలన్నదే మా లక్ష్యం. మా తాజా కలెక్షన్‌ను ప్రత్యక్షంగా అనుభవించేందుకు హైదరాబాద్ వినియోగదారులకు ఇది గొప్ప అవకాశం” అని పేర్కొన్నారు.

స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని, తొలి నెల రోజులు వాక్-ఇన్ కస్టమర్లకు ఫ్లాట్ 25% డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

ప్రస్తుతం ది బేర్ హౌస్ హైదరాబాద్ (బ్రాడ్‌వే, బంజారా హిల్స్), బెంగళూరు, న్యూఢిల్లీ వంటి ప్రముఖ నగరాల్లో తన ఆఫ్‌లైన్ ఉనికిని విస్తరిస్తోంది. ఫ్యాషన్‌కు ఓ కొత్త దిషా నిర్దేశం చేస్తున్న ఈ బ్రాండ్, ప్యూరిటీ, ఎలిగెన్స్, మోడ్రన్ డిజైన్‌కి అర్థం చెబుతోంది. https://thebearhouse.com/collections/shirts

About Author