భారతీయ పరిశ్రమలోనే తొలిసారిగా బ్రెయిలీలో బీమా పాలసీని ఆవిష్కరించిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,సెప్టెంబర్ 4,2024:భారత్‌లో దిగ్గజ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన స్టార్ హెల్త్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,సెప్టెంబర్ 4,2024:భారత్‌లో దిగ్గజ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ (స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్) బ్రెయిలీలో బీమా పాలసీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇలాంటి ప్రోడక్టును ప్రవేశపెట్టడమనేది పరిశ్రమలో ఇదే ప్రథమం. ఇన్‌క్లూజివిటీ,యాక్సెసబిలిటీపై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి గల నిబద్ధతను తెలియజేస్తూ, దృష్టి లోపం ఉన్నవారు,అంధులు తమ ఆరోగ్యం,ఆర్థికాంశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందడానికి అలాగే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పాటు అందించే దిశగా ఇదొక కీలక అడుగు కాగలదు.
భారతదేశంలోని 3.4 కోట్ల మంది దృష్టి లోపం గల/అంధత్వం గల వారు ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలు కల్పించడం ద్వారా వారికి ఆర్థిక సాధికారత కల్పించే దిశగా స్టార్ హెల్త్ ఒక వైవిధ్యమైన, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజివిటీ డ్రైవ్‌ను కూడా ఆవిష్కరించింది. సేవలు అంతగా అందని, సమాజంలో అట్టడుగున ఉండే ఈ వర్గాలవారు కంపెనీలో ఆరోగ్య బీమా ఏజంట్లుగా మారేందుకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు సంస్థ కట్టుబడి ఉంది. వారు తమకు సుపరిచితమైన వాతావరణంలోనే తమ వీలు ప్రకారం పని చేస్తూ, తమ బాధ్యతలను తామే చూసుకునేలా వారికి సాధికారత కల్పించేందుకు ఇది తోడ్పడగలదు.
“బ్రెయిలీలో ‘స్పెషల్ కేర్ గోల్డ్’ను ఆవిష్కరించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. సమాజంలోని అన్ని వర్గాల వారికి సమాన స్థాయిలో ఆరోగ్య బీమాను అందించాలన్న మా లక్ష్య సాధన దిశగా ఇదొక కీలక మైలురాయి. సాంప్రదాయ బీమా పరిధికి మించి, వైకల్యాలున్న వారికి కూడా అవసరమయ్యే సమగ్ర మద్దతు, కవరేజీ లభించేలా చూడటంలో మా నిబద్ధతను ఈ పాలసీ ప్రతిబింబిస్తుంది. బీమా రంగాన్ని మరింత సమ్మిళితమైనదిగా ముఖ్యంగా భారత్‌లో దృష్టి లోపం ఉన్న 3.4 కోట్ల మంది వ్యక్తులకు కూడా సేవలు లభించేలా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం.
‘అందరికీ బీమా’ అనే ఐఆర్‌డీఏఐ విజన్‌కి అనుగుణంగా అందరికీ నాణ్యమైన ఆరోగ్య బీమాను అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. అలాగే అంతగా సేవలు అందని, సమాజంలోని ఈ అట్టడుగు వర్గాలకు సుస్థిరమైన ఆదాయార్జన అవకాశాలను సృష్టించడం ద్వారా అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తేవడంపైనా మేము నిబద్ధతతో ఉన్నాం.
ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అవసరమైన తోడ్పాటును అందించేందుకు, సమాజంలో డైనమిక్ శక్తిగా ఉన్న శ్రీకాంత్ బొల్లాకి మించిన వారు మరెవరు ఉంటారు” అని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ & సీఈవో ఆనంద్ రాయ్ తెలిపారు.
“ప్రత్యేకమైన వైకల్యాలున్న వ్యక్తులకు తలెత్తే సవాళ్లను ఎదుర్కొన్న ఒక వ్యక్తిగా, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పరిశ్రమలోనే మొట్టమొదటిసారిగా ఈ తరహా సమ్మిళిత కార్యక్రమాన్ని చేపట్టడాన్ని అభినందిస్తున్నాను. స్పెషల్ కేర్ గోల్డ్ అనేది బ్రెయిలీలో అందించే బీమా పాలసీ మాత్రమే కాదు. సాధికారతకు, సమాన అవకాశాల లభ్యతకు ఇది ఒక సందేశంవంటిది.
ప్రత్యేక సామర్ధ్యాలున్న వారికి కూడా మిగతావారిలాగే ఆరోగ్యపరమైన రక్షణ పొందేందుకు సమాన హక్కులు ఉంటాయని, మన సమాజంలో సిసలైన సమ్మిళితత్వం సాధించే దిశగా ఇదొక కీలకమైన ముందడుగని నేను భావిస్తున్నాను. నేను, నా కుటుంబం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్లమని గర్వంగా చెబుతాను. ఇక ఇప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజంటుగా లైసెన్సు కూడా పొందడం సంతోషంగా ఉంది.
అలాగే తమ తలరాతను తామే తీర్చిదిద్దుకోవడంలో సహాయం అవసరమైన వారికి చేరేలా దీనికి ప్రచారం కల్పించడం ద్వారా కీలకమైన తోడ్పాటు అందించగలిగే అవకాశం లభించడం నాకు సంతోషకరమైన విషయం” అని బొల్లాంట్ ఇండస్ట్రీస్ సహ-వ్యవస్థాపకుడు & చైర్మన్ శ్రీ శ్రీకాంత్ బొల్లా తెలిపారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, విజువల్లీ ఇంపెయిర్డ్ ఎంట్రప్రెన్యూర్,బొల్లాంట్ ఇండస్ట్రీస్ సహ-వ్యవస్థాపకుడు, చైర్మన్ అయిన శ్రీకాంత్ బొల్లా,స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ & సీఈవో శ్రీ ఆనంద్ రాయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైకల్యాలున్న వ్యక్తుల (పీడబ్ల్యూడీ) విశిష్టమైన అవసరాలను తీర్చే విధంగా ‘స్పెషల్ కేర్ గోల్డ్’ పాలసీ ప్రత్యేకంగా తీర్చిదిద్దబడింది. భారత్‌లో 3.4 కోట్ల మంది ప్రజలు, అంటే దేశ జనాభాలో 2.5 శాతం మంది దృష్టి లోపం కలిగి ఉన్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2017లో వెల్లడించింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆప్థాల్మాలజీ 2022లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం దృష్టి లోపం వల్ల ఉత్పాదకతపరంగా రూ. 646 బిలియన్ల మేర ఆర్థిక నష్టం, రూ. 9,192 మేర తలసరి ఆదాయ నష్టం వాటిల్లుతుందని అంచనా.
అంతగా సేవలు అందుబాటులో ఉండని ఈ కీలక విభాగపు కస్టమర్లకు సమ్మిళితమైన, సమగ్రమైన హెల్త్ కవరేజీకి సంబందించిన ప్రధాన అవసరాలను తీర్చే విధంగా ఈ పాలసీ తీర్చిదిద్దబడింది. సాధారణంగా ఎవరూ అంతగా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్న వారితో పాటు ప్రతి ఒక్కరికీ నాణ్యమైన హెల్త్‌కేర్ అందుబాటులో ఉండేలా చూడటంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి గల నిబద్ధతకు స్పెషల్ కేర్ గోల్డ్ నిదర్శనంగా ఉంటుంది.
కొత్త రిక్రూట్లకు పరీక్ష సన్నాహాల్లో తోడ్పాటు, ఆడియో శిక్షణ మరియు వైకల్యాలు గల వ్యక్తులు (పీడబ్ల్యూడీ) పరీక్షలు రాసేందుకు స్క్రైబ్‌ను ఏర్పాటు చేయడం వంటి వాటికి నిధులపరమైన పూర్తి మద్దతు కల్పిస్తూ, వారికి అవసరమైన సమగ్ర సహకారం అందించాలనేది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లక్ష్యం. ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు ఏజెంట్ల కోసం ప్రత్యేక హాట్‌లైన్ నంబరు ఏర్పాటు చేయబడింది. అట్టడుగు వర్గాలవారు తమ ఇంటి నుంచే తమ వెసులుబాటు ప్రకారం పని చేస్తూ ఆదాయాన్ని పొందే వీలు కల్పించేలా, తమ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది.
నేషనల్ అసౌసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ (ఎన్ఏబీ) సహకారంతో “స్పెషల్ కేర్ గోల్డ్” పాలసీ డాక్యుమెంటు బ్రెయిలీ వెర్షన్ రూపొందించబడింది. శారీరకంగా, ఇంద్రియపరంగా లేదా మేథోపరమైన లోపాలకు సంబంధించి 40% లేదా అంతకు మించిన వైకల్యం ఉన్నవారికి తోడ్పడేలా ఈ పాలసీ కవరేజీ అందిస్తుంది. ముఖ్యమైన వైద్య చికిత్సలు, సపోర్ట్ సేవలకు ఇది కవరేజీనిస్తుంది.