‘స్పెక్టాక్యులర్ సౌదీ’ భారత్ టూర్ ఘన విజయం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 25,2025: సౌదీ అరేబియా టూరిజం బ్రాండ్ ‘సౌదీ, వెల్‌కమ్ టు అరేబియా’ నిర్వహించిన ‘స్పెక్టాక్యులర్ సౌదీ’ బహుళ-నగర
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 25,2025: సౌదీ అరేబియా టూరిజం బ్రాండ్ ‘సౌదీ, వెల్‌కమ్ టు అరేబియా’ నిర్వహించిన ‘స్పెక్టాక్యులర్ సౌదీ’ బహుళ-నగర ప్రదర్శన భారత్‌లో అద్భుత విజయం సాధించి ముగిసింది.
ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్ – ఈ ఐదు నగరాల్లో మూడేసి రోజుల పాటు జరిగిన ఈ మహోత్సవంలో దాదాపు 2 లక్షల మంది సందర్శకులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో శరత్ సిటీ మాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అరబిక్ కాఫీ-డేట్స్ రుచులు, అర్దా నృత్యం, అరబిక్ కాలిగ్రఫీ, సౌదీ కలినరీ అనుభవాలు, ఆర్ట్ షోకేస్‌లు, ప్రముఖుల చర్చలు, సౌదీకి సులువైన ట్రావెల్ ఆఫర్లు – అన్నీ ఒకేచోట ఆకట్టుకున్నాయి.

షీరాజ్ టూర్స్, అట్లాస్ ట్రావెల్స్, యాత్ర, ఫ్లిప్‌కార్ట్+క్లియర్‌ట్రిప్, అక్బర్ హాలిడేస్, మేక్ మై ట్రిప్ లాంటి ప్రముఖ భాగస్వాములు ఈ వేడుకలో కీలక పాత్ర పోషించారు.
సౌదీ టూరిజం అథారిటీ ఏపీఏసీ మార్కెట్స్ అధ్యక్షుడు అల్హాసన్ అల్దబ్బాగ్ మాటల్లో…
“భారత్‌కు సౌదీ మళ్లీ వచ్చి, రెండు దేశాల మధ్య లోతైన సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేసింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరులో సౌదీ సంస్కృతి, వంటకాలు, కళ, నృత్యం పట్ల అద్భుతమైన స్పందన లభించింది. భారత్ మా అతి ముఖ్యమైన మార్కెట్.
రెండు దేశాల మధ్య ఎయిర్ కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తున్నాం. భారత్ నుంచి ఇంకా ఎక్కువ మంది సందర్శకులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం” అని అన్నారు.
సౌదీ అరేబియా ఆత్మ, సంస్కృతి, ఆతిథ్యాన్ని భారతీయులకు అద్భుతంగా పరిచయం చేసిన ‘స్పెక్టాక్యులర్ సౌదీ’… రానున్న రోజుల్లో భారత్-సౌదీ టూరిజం సంబంధాలకు కొత్త ఊపిరి పోస్తుందనడంలో సందేహం లేదు..!