రష్మిక మందన్నను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న Signify – స్టైల్ & ఆవిష్కరణల కొత్త దశకు శ్రీకారం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఇండియా,ఫిబ్రవరి 8,2025: ప్రపంచవ్యాప్తంగా లైటింగ్ రంగంలో అగ్రగామిగా నిలిచిన Signify (Euronext: LIGHT) డైనమిక్ స్టార్, నేషనల్ క్రష్ రష్మిక
![](https://varahimedia.com/wp-content/uploads/2025/02/Rashmika-Mandanna.jpg)
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఇండియా,ఫిబ్రవరి 8,2025: ప్రపంచవ్యాప్తంగా లైటింగ్ రంగంలో అగ్రగామిగా నిలిచిన Signify (Euronext: LIGHT) డైనమిక్ స్టార్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ను తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ భాగస్వామ్యం వేసవి కాలానికి ముందు చేపట్టిన వ్యూహాత్మక అడుగుగా, సిగ్నిఫై తన ఆవిష్కరణలు, ఇంధన సామర్థ్యం, వినియోగదారులకేంద్రీకృత దృక్పథాన్ని మరింత బలోపేతం చేయనుంది.
రష్మిక మందన్న తన అద్భుతమైన నటన, స్టైల్, పాన్-ఇండియా ఫాలోయింగ్‌తో విశేషమైన గుర్తింపు పొందారు. యువతలో విస్తృతంగా ఆదరణ పొందే ఆమెతో కలిసి, సిగ్నిఫై కొత్త తరానికి మరింత చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భాగస్వామ్యం బ్రాండ్‌కు వినియోగదారులను ప్రేరేపించేందుకు, వారితో మరింత మమేకం కావడానికి దోహదపడనుంది.
![](http://varahimedia.com/wp-content/uploads/2025/02/Rashmika-Mandanna.jpg)
సిగ్నిఫై లీడర్‌ల స్పందన:
సిగ్నిఫై గ్రేటర్ ఇండియా సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ జోషి మాట్లాడుతూ –
“మా #BrighterLivesBetterWorld లక్ష్యానికి అనుగుణంగా వినియోగదారులకు ఉత్తమమైన ఆవిష్కరణలను అందించడమే మా ధ్యేయం. మేం రష్మిక మందన్నను మా Ecolink & Philips బ్రాండ్‌ల అంబాసిడర్‌గా ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆమె శక్తివంతమైన వ్యక్తిత్వం, నిబద్ధత, మేము అనుసరించే నాణ్యత, ఆవిష్కరణ, తరతరాలుగా కొనసాగే విశ్వాసం అనే విలువలకు సమపాళ్లుగా ఉంటాయి. రష్మికతో మా భాగస్వామ్యాన్ని వినియోగదారులు ఎంతో ఉత్సాహంగా స్వాగతిస్తారని మా నమ్మకం” అని తెలిపారు.
సిగ్నిఫై గ్రేటర్ ఇండియా మార్కెటింగ్, వ్యూహం, ప్రభుత్వ వ్యవహారాలు & CSR హెడ్ నిఖిల్ గుప్తా మాట్లాడుతూ –
“రష్మిక మందన్న తన డైనమిక్ ఉనికి, సమగ్రతతో సిగ్నిఫై విలువలకు నిజమైన ప్రతిబింబంగా నిలుస్తారు. యువతను ఆకట్టుకునేందుకు ఈ భాగస్వామ్యం మా ప్రయాణంలో ఓ కీలక మైలురాయిగా మారనుంది. రష్మికతో కలిసి భారతీయ వినియోగదారులతో మరింత గాఢంగా మమేకం అయ్యేందుకు, వేసవి సీజన్‌లో మా కొత్త హై ఎనర్జీ ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం” అని అన్నారు.
![](http://varahimedia.com/wp-content/uploads/2025/02/Rashmika-Mandanna.jpg)
ఈ భాగస్వామ్యంపై రష్మిక మందన్న మాట్లాడుతూ –
“సిగ్నిఫై కుటుంబంలో చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారి 130 సంవత్సరాల వైభవవంతమైన ఆవిష్కరణల, నాణ్యతా వారసత్వం నిజంగా గొప్పది. స్థిరమైన భవిష్యత్తుపై వారి నిబద్ధత, ప్రజల జీవితాలను మెరుగుపరిచే లైటింగ్ సొల్యూషన్లపై వారి దృష్టిని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఈ ప్రయాణంలో భాగమవడం ఎంతో సంతోషంగా ఉంది” అని తెలిపారు.
ఈ కొత్త భాగస్వామ్యంతో రష్మిక మందన్న భారతదేశంలోని సిగ్నిఫై బ్రాండ్‌లకు ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. ఆమె స్టైల్, గ్రేస్, స్ట్రాంగ్ వ్యక్తిత్వం బ్రాండ్ విలువలకు సరిగ్గా సరిపోతాయి. దీని ద్వారా వినియోగదారుల మద్దతును మరింత విస్తృతంగా పొందే అవకాశం ఉంది.