“మహిళా రుణగ్రహీతల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల – ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక”

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,మార్చి 5,2025: భారత్‌లో రుణాలు తీసుకుంటున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అలాగే తమ క్రెడిట్ స్కోర్లు, రిపోర్టులను

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,మార్చి 5,2025: భారత్‌లో రుణాలు తీసుకుంటున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అలాగే తమ క్రెడిట్ స్కోర్లు, రిపోర్టులను క్రియాశీలకంగా సమీక్షించుకునే (సెల్ఫ్ మానిటరింగ్) మహిళల సంఖ్యా పెరుగుతోంది. మహిళలు,రిటైల్ క్రెడిట్‌పై వార్షిక నివేదిక “ఫ్రం బారోయర్స్ టు బిల్డర్స్: ఉమెన్స్ రోల్ ఇన్ ఇండియాస్ ఫైనాన్షియల్ గ్రోత్ స్టోరీ “లో ఈ కీలకాంశాలు వెల్లడయ్యాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ (TransUnion CIBIL), నీతి ఆయోగ్‌కి (Niti Aayog) చెందిన ఉమెన్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫాం (డబ్ల్యూఈపీ), మైక్రోసేవ్ కన్సల్టింగ్ (ఎంఎస్‌సీ) దీన్ని రూపొందించాయి.

నివేదిక ప్రకారం 27 మిలియన్ల మహిళా రుణగ్రహీతలు 2024 డిసెంబర్‌లో తమ రుణాలను క్రియాశీలకంగా పర్యవేక్షించుకుంటున్నారు. ఇది 2023 డిసెంబర్‌లో నమోదైన సుమారు 19 మిలియన్ల మహిళలతో పోలిస్తే 42 శాతం అధికం. ఆర్థిక సాధికారతకు మెరుగైన రుణ నాణ్యత కీలకమైనదని మహిళా రుణగ్రహీతలు మరింతగా గుర్తిస్తున్నారనడానికి ఇది నిదర్శనం.

క్రెడిట్ మానిటరింగ్‌లో ముందుంటున్న యువ మహిళలు

పనుల్లో చేరే లేదా ఎంట్రప్రెన్యూర్లుగా మారే మహిళల సంఖ్య పెరిగే కొద్దీ అధికారిక రుణాలకు లభ్యతనేది, వారు తమ కెరియర్లలో పురోగమించేందుకు, లేదా వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చుకునేందుకు మార్గాన్ని ఏర్పరుస్తోంది. అంతేగాకుండా, తమ రుణాలను సమీక్షించుకోవడం వల్ల మహిళా రుణగ్రహీతలు ఆర్థికంగా ఆరోగ్యకరమైన తీరుతెన్నులను పాటించడానికి, రుణాల నిబంధనలపరంగా మెరుగైన ప్రయోజనాలు పొందడానికి, ఐడెంటిటీ చోరీ నుంచి రక్షణ పొందడానికి తోడ్పడుతోంది.

“దేశీయంగా వర్క్‌ఫోర్స్‌లో చేరుతున్న మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చూడటానికి మహిళా ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడం కూడా ఒకానొక మార్గం. ఎకానమీ సమానంగా, వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించేందుకు ఇదొక లాభదాయకమైన వ్యూహంగా ఉండగలదు.

శ్రామిక శక్తిలో మరింత మంది మహిళలను భాగస్వాములను చేస్తూనే మహిళల్లో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడం వల్ల 15 నుంచి 17 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు” అని నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా నీతి ఆయోగ్ ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వైజర్, WEP మిషన్ డైరెక్టర్ ఆనా రాయ్ (Anna Roy) తెలిపారు.

Read this also…TransUnion CIBIL, WEP, and MSC Report Highlights 42% Growth in Women Borrowers Monitoring Credit Health

ఇది కూడా చదవండి..కరుణడ చక్రవర్తి’ శివ రాజ్‌కుమార్ లుక్ టెస్ట్ పూర్తి – త్వరలో RC 16 సెట్స్‌లో జాయిన్

మహిళా ఎంట్రప్రెన్యూర్లకు సాధికారత కల్పించడంలో రుణ లభ్యత పోషించే కీలక పాత్రను ప్రస్తావిస్తూ, “మహిళా ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు ఆర్థికంగా నిధుల లభ్యత ప్రాథమికాంశంగా ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. ఉమెన్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫాం (డబ్ల్యూఈపీ) అనేది ఆర్థిక అక్షరాస్యత, రుణ లభ్యత, మెంటార్‌షిప్, మార్కెట్ లింకేజీలను పెంపొందించే సమ్మిళిత వ్యవస్థను నిర్మించే దిశగా పని చేస్తోంది. అయితే, అందరికీ సమాన స్థాయిలో నిధులను అందుబాటులోకి తేవాలంటే సమష్టి కృషి అవసరం.

దీన్ని వేగవంతం చేసేందుకు, వ్యవస్థాగత అడ్డంకులను తొలగించే విధానాలతో పాటు మహిళల అవసరాలకు అనుగుణంగా ఉండే ఉత్పత్తులను రూపొందించడంలో ఆర్థిక సంస్థలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో WEP పరిధిలో ఫైనాన్సింగ్ ఉమెన్ కొలాబొరేటివ్ (ఎఫ్‌డబ్ల్యూసీ) ఏర్పాటు చేయనుంది. ఇందులో మరిన్ని ఆర్థిక రంగ సంస్థలు భాగం కావాలని, లక్ష్య సాకారానికి తోడ్పడాలని కోరుకుంటున్నాం” అని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.

“తమ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును స్వయంగా సమీక్షించుకునే మహిళల సంఖ్య 2023 డిసెంబర్‌లో 18.94 మిలియన్లుగా ఉండగా 2024 డిసెంబర్ నాటికి 42 శాతం పెరిగి 26.92 మిలియన్లకు చేరింది. ఇది సానుకూల ధోరణే అయినప్పటికీ, భారత ఆర్థిక వృద్ధి గాధలో మహిళలు కేవలం పాలుపంచుకునే వారిగా మిగిలిపోకుండా సారథులుగా పురోగమించాలంటే ఈ తీరు ఇకపైనా కొనసాగాలి. తమ రుణ హోదా విషయంలో అప్రమత్తంగా ఉండటం ద్వారా రుణగ్రహీతలు, పూర్తి సమాచారంతో సముచిత ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సాధ్యపడుతుంది” అని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఎండీ & సీఈవో Mr. భావేష్ జైన్ (Bhavesh Jain) తెలిపారు.

Read this also…Karunada Chakravarthy Shiva Rajkumar Completes Look Test for Ram Charan’s RC 16; Gears Up to Join the Shoot Soon

Read this also…Pawan Kalyan Announces Konidela Naga Babu as MLC Candidate

స్వీయ సమీక్ష చేసుకుంటున్న మొత్తం రుణగ్రహీతల్లో మహిళల వాటా 2023 డిసెంబర్‌లో 17.89 శాతంగా ఉండగా 2024 డిసెంబర్ నాటికి 19.43 శాతానికి పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది.

“ఈ నివేదికలో పలు కీలకాంశాలు వెల్లడయ్యాయి. రుణాల కోసం సంప్రదించే మహిళల సంఖ్య 2019 నుంచి వార్షిక ప్రాతిపదికన 22 శాతం పెరిగింది. 60 శాతం మంది రుణ గ్రహీతలు సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారై ఉంటున్నారు. మెట్రో నగరాల పరిధిని దాటి ఆర్థిక కార్యకలాపాల విస్తరణను ఇది సూచిస్తోంది” అని MSC మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ శర్మ చెప్పారు.

అంతే గాకుండా, రుణాలను పర్యవేక్షించుకోవడంలో యువ Gen Z మహిళలు ముందుంటున్నారు. ఈ వర్గంలోని మహిళల సంఖ్య వార్షిక ప్రాతిపదికన (YoY) 56% పెరిగింది. దీంతో 2024లో స్వయంగా పర్యవేక్షించుకుంటున్న మహిళల్లో వీరి వాటా 22 శాతానికి చేరింది. ఇదే సమయంలో మిలీనియల్3 మహిళల సంఖ్య YoY ప్రాతిపదికన 38 శాతం పెరిగింది. స్వీయ మానిటరింగ్ చేసే మహిళల్లో వీరి వాటా 52 శాతానికి చేరింది.

స్వీయ మానిటరింగ్ చేసే మొత్తం జనాభాలో చూస్తే Gen Z మహిళా రుణ గ్రహీతల సంఖ్య 2023 డిసెంబర్‌లో 24.9 శాతంగా ఉండగా 2024 డిసెంబర్‌ నాటికి 27.1 శాతానికి చేరింది. ఈ కొలమానాలు వృద్ధి చెందడమనేది, ఆర్థిక స్వాతంత్ర్యం సాధించే దిశగా ఆర్థికాంశాలపై అవగాహన అధిక స్థాయిలో ఉండటం, రుణ నిర్వహణ సాధనాలకు ఆమోదయోగ్యత పెరుగుతుండటాన్ని సూచిస్తోంది.

2024 నాటికి సెల్ఫ్ మానిటరింగ్ మహిళా వినియోగదారుల వయో వివరాలు

మహిళా రుణ గ్రహీతల రుణ ప్రాధాన్యతల్లో మార్పులు

భారత్‌లో రుణాలను తీసుకునే మహిళల సంఖ్య CY2019 నుంచి 2024 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 22 శాతం వృద్ధి (CAGR) చెందింది. నివేదిక ప్రకారం మహిళలు తీసుకునే లోన్‌లలో ఎక్కువగా వినియోగ రుణాలకు ప్రాధాన్యత ఉంటుండగా, వ్యాపార రుణాలను తీసుకునే మహిళల సంఖ్య కూడా గణనీయంగా ఉంటోందని తెలుస్తోంది.

2024లో వ్యాపార అవసరాల కోసం (బిజినెస్ లోన్స్, వాణిజ్య వాహనాలు ,కమర్షియల్ ఎక్విప్‌మెంట్ రుణాలు, ప్రాపర్టీపై రుణాలు) మహిళలు ప్రారంభించిన కొత్త రుణ ఖాతాల సంఖ్య సుమారుగా 37 లక్షలు పెరిగింది. రూ. 1.9 లక్షల కోట్ల మేర రుణ వితరణ నమోదైంది. 2019లో వ్యాపార అవసరాల రీత్యా తెరిచిన కొత్త రుణ ఖాతాల సంఖ్య 8 లక్షలుగా ఉండగా రూ. 0.7 లక్షల కోట్ల రుణ వితరణ నమోదైంది. రుణ ఖాతాలు 2019తో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగినప్పటికీ, 2024లో మహిళా రుణగ్రహీతలు తీసుకున్న మొత్తం రుణాల్లో ఈ లోన్‌ల వాటా కేవలం 3 శాతంగానే ఉంది.

ఇది కూడా చదవండి..ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్

Read this also...Blue Star Unveils 150 New Room AC Models, Strengthens Presence in Smart WiFi & Heavy-Duty Segments

మహిళా రుణగ్రహీతల్లో ఎక్కువగా వినియోగ రుణాలకు ప్రాధాన్యత ఉంటోంది. వినియోగ రుణాలను క్రియాశీలకంగా నిర్వహిస్తున్న మహిళల వాటా 2019లో 33 శాతంగా ఉండగా 2024 డిసెంబర్‌లో 36 శాతానికి పెరిగాయి. వ్యవసాయ, పసిడి రుణాలు తీసుకున్న మహిళా రుణగ్రహీతల వాటాను చూస్తే 2019 డిసెంబర్లో 32 శాతంగా ఉండగా 2024 డిసెంబర్‌లో 34 శాతానికి పెరిగింది. వ్యాపార రుణాల్లో అత్యధికంగా మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యాపార అవసరాల రీత్యా రుణం తీసుకుని ఉన్న మహిళా రుణగ్రహీతల సంఖ్య 2019 డిసెంబర్‌లో 9 శాతంగా ఉండగా, 2024 డిసెంబర్‌లో 16 శాతానికి చేరింది.

రుణాలపై అవగాహన ఉంటే మరింతగా రుణాలు తీసుకునేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది

ట్రాన్స్‌యూనియన్ సిబిల్ డేటా ప్రకారం తమ రుణ వివరాలను క్రియాశీలకంగా పర్యవేక్షించుకునే మహిళల్లో 13.49 శాతం మంది తాము సమీక్ష చేసుకున్న నెల రోజుల వ్యవధిలోగా రుణ ఖాతాను తీసుకుంటున్నారు. రుణ సమాచారంపై అవగాహన, స్వయంగా పర్యవేక్షించుకోవడమనేది రుణాలను పొందే దిశగా చర్యలు తీసుకునేలా పరివర్తన చెందుతుండటాన్ని ఇది సూచిస్తోంది.

అలాగే, తమ రుణ సమాచారాన్ని క్రియాశీలకంగా పర్యవేక్షించుకునే మహిళా రుణగ్రహీతల్లో 44 శాతం మంది, ఆరు నెలల కాలంలోగా తమ క్రెడిట్ స్కోర్లను మెరుగుపర్చుకోగలిగారు. ఆర్థిక అంశాలపై అవగాహన చూపే సానుకూల ప్రభావాన్ని ఇది సూచిస్తుంది. తమ రుణ వివరాలను పరిశీలించుకునేటప్పుడు 90 పైగా రోజుల బాకీ (డీపీడీ) కేటగిరి నుంచి ఎగవేత అవకాశాలు తక్కువగా ఉన్న విభాగంలోకి చేరే మహిళల సంఖ్య, ఆరు నెలల వ్యవధిలో 17.45 శాతానికి చేరింది. ప్రామాణిక రుణ గ్రహీతల విషయానికొస్తే ఇది 11.37 శాతంగా ఉంది. మరింత ఎక్కువ రుణాలు తీసుకునేందుకు తోడ్పడటంతో పాటు స్వీయ పర్యవేక్షణ అనేది ఆర్థిక వ్యవహారాలను మెరుగుపర్చుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని ఇది సూచిస్తుంది.

“రుణాల సకాలంలో తిరిగి చెల్లించేసి, క్రెడిట్ స్కోర్లను మెరుగుపర్చుకునే ధోరణుల వల్ల, వివిధ రకాల అవసరాల కోసం బహుళ రుణాలను తీసుకునే మహిళల సంఖ్య పెరుగుతోంది. రుణార్హత కలిగి ఉండి, రుణం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న మహిళా రుణగ్రహీతలను గుర్తించేందుకు, తోడ్పాటు అందించేందుకు రుణదాతలు ఈ చెల్లింపుల డేటాను ఉపయోగించుకోవచ్చు. అలాగే రీపేమెంట్‌లో సహాయ అవసరం ఉన్న వారికి మద్దతునిచ్చేందుకు కూడా ఇది ఉపయోగపడగలదు. రుణగ్రహీతలతో దీర్ఘకాలికమైన, విశ్వసనీయత ఆధారితమైన బంధాన్ని ఏర్పర్చుకునేందుకు ఇది పునాదులు వేయగలదు” అని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్,హెడ్ (డైరెక్ట్-టు-కన్జూమర్ బిజినెస్) భూషణ్ పాడ్కిల్ (Bhushan Padkil) తెలిపారు.

స్వీయ మానిటరింగ్ చేసే మహిళా రుణగ్రహీతల రాష్ట్రాలవారీ విస్తరణ

నివేదిక ప్రకారం మెట్రోలతో పోలిస్తే నాన్-మెట్రో ప్రాంతాల్లో మరింత మంది మహిళా రుణగ్రహీతలు తమ రుణాల స్వీయ పర్యవేక్షణ విషయంలో క్రియాశీలకంగా ఉంటున్నారు. మెట్రో ఏరియాల్లో సెల్ఫ్-మానిటరింగ్ చేసుకునే మహిళల సంఖ్య YoY ప్రాతిపదికన 30 శాతం పెరగ్గా, అదే వ్యవధిలో నాన్-మెట్రో ప్రాంతాల్లో ఇది 48 శాతం పెరిగింది.

CY 2024లో సెల్ఫ్ మానిటరింగ్ చేసే మహిళలకు సంబంధించి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, మరియు తెలంగాణ టాప్ అయిదు రాష్ట్రాలుగా ఉన్నాయ. మొత్తం అన్ని రాష్ట్రాల్లోని సెల్ఫ్-మానిటరింగ్ మహిళల్లో దాదాపు 49 శాతం మంది ఈ రాష్ట్రాల్లోనే ఉన్నారు. దక్షిణాదిలో సెల్ఫ్-మానిటరింగ్ మహిళలు అత్యధికంగా 10.2 మిలియన్ల స్థాయిలో ఉన్నారు. 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు కాలంలో ఈ ప్రాంతంలో సెల్ఫ్ మానిటరింగ్ మహిళల సంఖ్య 46 శాతం వృద్ధి చెందింది.

రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్,మధ్యప్రదేశ్ లాంటి ఉత్తరాది,సెంట్రల్ రాష్ట్రాల్లో, గత అయిదేళ్ల వ్యవధిలో క్రియాశీలకంగా ఉన్న మహిళా రుణగ్రహీతల సంఖ్య వార్షిక ప్రాతిపదికన అత్యధిక వృద్ధి రేటు (CAGR) నమోదు చేసింది.

మరింతగా మహిళా ఆధారితమైన, సమ్మిళితమైన ఆర్థిక కార్యక్రమాల ఆవశ్యకత

2019 నుంచి మహిళల వాటా వ్యాపార రుణాల్లో 14 శాతం, పసిడి రుణాల్లో 6 శాతం పెరిగింది. 2024 డిసెంబర్ నాటికి భారత్‌లో వ్యాపార రుణగ్రహీతల్లో మహిళల వాటా 35 శాతంగా ఉంది. రుణాలపై అవగాహన, రుణ నాణ్యత మెరుగుపడుతున్నట్లుగా సానుకూల సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, రుణాలను పొందడంలో మహిళా రుణగ్రహీతలకు ఇంకా సవాళ్లు ఉంటున్నాయి.

రుణాలను తీసుకోవంపై అయిష్టత, బ్యాంకింగ్ లావాదేవీల్లో అంత సంతృప్తికరమైన అనుభవం లేకపోవడం, రుణ సన్నద్ధతకు అవరోధాలు, తనఖా , గ్యారంటార్లపరమైన పరిమితులు మొదలైనవి ఇందుకు కారణాలుగా ఉంటున్నాయి.

రుణాలపై అవగాహన, స్కోర్లు మెరుగుపడుతున్న కొద్దీ మహిళల విశిష్టమైన వ్యాపార, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉండే జెండర్ ఇంటెలిజెంట్ ఫైనాన్షియల్ ప్రోడక్టుల ద్వారా వారికి మరింతగా రుణాలను అందించడానికి ఆర్థిక సంస్థలకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయి.

మహిళా రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ, “ఈ సవాళ్ల పరిష్కారానికి బహుముఖ వ్యూహం అవసరం. ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ అనుభూతిని మెరుగుపర్చడం, మరింత సమ్మిళిత ఆర్థిక ఉత్పత్తులు,సేవలను రూపొందిచాల్సిన అవసరం ఉంది. తద్వారా మహిళా రుణగ్రహీతలకు రుణ లభ్యత సమానంగా ఉండేలా, తమ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు వారికి అవకాశం లభించేలా చూడొచ్చు” అని జైన్ తెలిపారు.

About Author