ఐపీవో కోసం సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన శ్రీజీ షిప్పింగ్ గ్లోబల్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 28,2025:డ్రై బల్క్ కార్గోకు సంబంధించి షిప్పింగ్, లాజిస్టిక్స్ సొల్యూషన్స్ అందించే శ్రీజీ షిప్పింగ్ గ్లోబల్ లిమిటెడ్ (Shreeji Shipping Global Ltd) సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా నిధులను సమీకరించేందుకు అనుమతి కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. దీని ప్రకారం ఐపీవో కింద మొత్తం 2 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది.

ఇష్యూ ద్వారా వచ్చిన నిధుల్లో రూ. 289.4 కోట్ల మొత్తాన్ని సెకండరీ మార్కెట్లో సుప్రామ్యాక్స్ కేటగిరీలోని డ్రై బల్క్ క్యారియర్లను కొనుగోలు చేసేందుకు, రూ. 19.5 కోట్ల మొత్తొన్ని రుణాల చెల్లింపునకు ఉపయోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది. 2025 సెప్టెంబర్ నాటికి కంపెనీ మొత్తం రుణాలు రూ. 264.54 కోట్లుగా ఉన్నాయి.

2024 సెప్టెంబర్ నాటికి మొత్తం 20 పైగా పోర్టులు, జెట్టీల ద్వారా కంపెనీ సర్వీసులను అందించింది. వీటిలో కాండ్లా లాంటి భారీ భారతీయ పోర్ట్‌లతో పాటు నాన్-మేజర్ పోర్టులైన నవ్‌లఖీ, మగ్దల్లా, భావనగర్, బేది, ధర్మతార్ ,శ్రీలంకలోని పుట్టాలం పోర్టులో విదేశీ పోర్టు ఉన్నాయి.

2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 124.51 కోట్ల లాభాన్ని (PAT) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ. 118.89 కోట్లు. ఇక ఆదాయం రూ. 827.33 కోట్ల నుంచి తగ్గి రూ. 736.17 కోట్లకు పరిమితమైంది.

బీలైన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్,ఎలారా క్యాపిటల్ (ఇండియా) ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

About Author