ఏప్రిల్ 4న విడుదల కానున్న ‘శివాజ్ఞ’..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 3,2025: భక్తి, జ్ఞానం, వైరాగ్యం భగవంతుడిని చేరుకునే మార్గాలు. భక్తి ఫలితం జ్ఞానం, జ్ఞానంతో దైవత్వం ప్రస్ఫుటమవుతుంది. భక్తి రసంతో నిండిన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 3,2025: భక్తి, జ్ఞానం, వైరాగ్యం భగవంతుడిని చేరుకునే మార్గాలు. భక్తి ఫలితం జ్ఞానం, జ్ఞానంతో దైవత్వం ప్రస్ఫుటమవుతుంది. భక్తి రసంతో నిండిన చిత్రం ‘శివాజ్ఞ’ ప్రేక్షకుల మనసుకు శాంతిని, ఆత్మకు శక్తిని అందించేందుకు సిద్ధమైంది.

Read this also…‘Shivajna’ to Have Free Screenings on Release Day Across 108 Theaters

ఇది కూడా చదవండి...పిఠాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం – నాగబాబు పర్యటన

సీనియర్ నటుడు భానుచందర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివ పరమాత్మ జ్ఞాన మందిరం ట్రస్ట్ సమర్పణలో, శివ పరమాత్మ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఆధ్యాత్మికతను ప్రధానంగా అద్దుకుంది.

ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ, ‘శివాజ్ఞ’ చిత్రం విడుదలైన మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 108 థియేటర్లలో తొలి నాలుగు షోలు ఉచితంగా ప్రదర్శించనున్నట్టు ప్రకటించింది.

భక్తి, ఆధ్యాత్మికతకు తోడు కుటుంబ సంబంధాలను హృద్యంగా చెప్పే ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పారు. ఏప్రిల్ 4న థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆస్వాదించాలని ప్రేక్షకులకు చిత్రబృందం ఆహ్వానం పలికింది.

ఇది కూడా చదవండి...శ్రీవారికి రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

Read this also…Andhra Pradesh Takes a Green Leap: Nara Lokesh Lays Foundation for Reliance CBG Plant in Prakasam

నటీనటులు:
వెంకట్ గోవాడ
అశ్రిత వేముగంటి
కిరణ్
హర్షిణి
మాధవి
DD శ్రీనివాస్
శరత్
ప్రభావతి
జ్యోతి రాజ్
బ్రహ్మ కుమారి సిస్టర్ : దీప్తి

హేమసుందర్
భానుచందర్

చైల్డ్ ఆర్టిస్ట్స్ : శ్రీలక్ష్మి, తేజస్విని అండ్ అద్దేపల్లి శివ విష్ణు తేజ వర్ణ

టెక్నికల్ టీం:
K.S.M.N రాజ్య లక్ష్మి
V.S.V.V. మణికంఠ
వెంకట్ అన్నెము
మధు
అచ్చు రాజమణి
శ్రీరామ్ తపస్వి

About Author