సీఎం చంద్రబాబుతో సీనియర్ నేత నాగం భేటీ
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, మార్చి 13,2025: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, మార్చి 13,2025: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనను ఆత్మీయంగా పలకరించారు.
“నాగం గారూ… ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? చాలాకాలం తర్వాత కలుస్తున్నాం” అంటూ చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడారు. కుటుంబ సభ్యుల గురించి ఆరా తీశారు. ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.
ఇది కూడా చదవండి…కడప జిల్లాలో 40 ఏళ్లుగా అన్నదానం చేస్తున్న ఆశ్రమం కూల్చివేత
నాగం జనార్థన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో చంద్రబాబును కలిశారు.

ఇద్దరు నేతలు పలు పాత ఘటనలను గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపై, పార్టీ పోరాటాలపై చర్చించుకున్నారు. “నాగం గారు ఫైర్‌బ్రాండ్… పార్టీ నిర్ణయం తీసుకుంటే ఎవ్వరినైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్న నేత” అంటూ చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Read this also…Tata AIA Delivers Superior Fund Performance Across ULIP Offerings
ఇది కూడా చదవండి…యాక్సిస్ నిఫ్టీ500 మొమెంటం 50 ఈటీఎఫ్ విడుదల.
చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు ఆనందంగా ఉందని నాగం తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.