విజయవాడలో ‘కలర్స్ హెల్త్‌కేర్ 2.0’ని ప్రారంభించిన సంయుక్త మీనన్..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ, సెప్టెంబర్ 10, 2025: ప్రముఖ హెల్త్‌కేర్ బ్రాండ్ అయిన కలర్స్ హెల్త్‌కేర్ తమ విస్తరణలో భాగంగా విజయవాడలో కొత్త బ్రాంచ్‌ను

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ, సెప్టెంబర్ 10, 2025: ప్రముఖ హెల్త్‌కేర్ బ్రాండ్ అయిన కలర్స్ హెల్త్‌కేర్ తమ విస్తరణలో భాగంగా విజయవాడలో కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో స్థాపించిన ‘కలర్స్ హెల్త్‌కేర్ 2.0’ని ప్రముఖ నటి సంయుక్త మీనన్ ప్రారంభించారు. ఆమె కేంద్రంలోని ఆధునిక సౌకర్యాలను స్వయంగా పరిశీలించి, నిర్వాహకులను అభినందించారు.

ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇతరులను అనుకరించడం కాదు, మన సొంత శైలిలో ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అత్యాధునిక సాంకేతికతతో నాణ్యమైన హెల్త్‌కేర్ సేవలను అందిస్తున్న కలర్స్ హెల్త్‌కేర్ నిర్వాహకులకు అభినందనలు. అందరూ ఆరోగ్యంగా, అందంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. విజయవాడ ప్రజలకు ఇలాంటి నమ్మకమైన, ఆహ్లాదకరమైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది,” అని పేర్కొన్నారు.

కలర్స్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన్ మాట్లాడుతూ, “2004లో స్థాపించబడిన కలర్స్ హెల్త్‌కేర్ ఇప్పటివరకు వేలాది మంది కస్టమర్లకు సేవలు అందించింది. దేశవ్యాప్త విస్తరణలో భాగంగా విజయవాడలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించాము. లేటెస్ట్ టెక్నాలజీలను అనుసరిస్తూ మా సేవలను మరింత బలోపేతం చేస్తున్నాము,” అని తెలిపారు.

డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ కృష్ణ రాజ్ మాట్లాడుతూ, “గత 21 సంవత్సరాలుగా కలర్స్ హెల్త్‌కేర్‌కు కస్టమర్ల సంతృప్తి బలమైన మద్దతుగా నిలిచింది. వారి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విజయవాడలో ఈ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించాము. యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో, కలర్స్ హెల్త్‌కేర్ 2.0 అధిక బరువు, జుట్టు, చర్మ సమస్యలకు ప్రపంచ స్థాయి చికిత్సలను అందిస్తుంది,” అని వివరించారు.

మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ, “కలర్స్ హెల్త్‌కేర్ సేవలను విజయవాడకు విస్తరించడం సంతోషంగా ఉంది. ఈ బ్రాంచ్‌ను ప్రారంభించిన సంయుక్త మీనన్‌కు కృతజ్ఞతలు. అందంగా, ఆరోగ్యంగా ఉండాలనే ప్రతి ఒక్కరి కోరికకు కలర్స్ హెల్త్‌కేర్ మద్దతుగా నిలుస్తుంది,” అని అన్నారు.

Read This also…Actress Samyuktha Menon Inaugurates ‘Kolors Healthcare 2.0’ in Vijayawada..

5M మీడియా ఆధ్వర్యంలో జైదీప్ సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమం సందడిగా జరిగింది. సంయుక్త మీనన్‌ను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. పలువురు ప్రముఖులు మరియు అతిథులు కలర్స్ హెల్త్‌కేర్ నిర్వాహకులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

About Author