హైదరాబాద్‌లో క్వాంబియంట్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2024
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్6, 2024: క్వాంబియంట్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2024లో బహుమతుల ప్రదానం కార్యక్రమానికి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్6, 2024: క్వాంబియంట్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2024లో బహుమతుల ప్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో Ms. జెన్నిఫర్ లార్సన్, కాన్సులర్ జనరల్ US కాన్సులేట్, హైదరాబాద్; వీసీ. సజ్జనార్, IPS, MD TSRTC; డాక్టర్ బార్ట్ S. ఫిషర్, చైర్మన్, గివ్ లైఫ్ ఫౌండేషన్ 10K, 5K ,2K రన్ ప్రారంభించారు. ఈ పరుగులో మొత్తం 20,000 మంది పాల్గొన్నారు.

బహుమతులు: మంత్రిగారు ఇతర అతిథులతో కలిసి “క్వాంబియంట్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2024” విజేతలకు బహుమతులు అందజేశారు. పురుషుల 10K విభాగంలో, మోహిత్ చౌదరి 33.22 నిమిషాల్లో 10K పరుగును పూర్తి చేసి రూ. 12,500/- ప్రైజ్ మనీని సంపాదించి మొదటి స్థానంలో నిలిచాడు. బోడుపల్లి రమేష్ 34.15 నిమిషాల్లో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచి రూ. 7500/- ప్రైజ్ మనీ, రమేష్ చంద్ర 34.15 నిమిషాల్లో పరుగు పూర్తి చేసి తృతీయ స్థానంలో నిలిచి రూ. 5000/- ప్రైజ్ మనీని కైవసం చేసుకున్నారు.
మహిళల 10K రన్ విభాగంలో ఉమ 40.41 నిమిషాల్లో, మహేశ్వరి 42.45 నిమిషాల్లో, రాజేశ్వరి 43.58 నిమిషాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి వరుసగా రూ. 12,500/-, 7,500/-5000/- ప్రైజ్ మనీ కైవసం చేసుకున్నారు.
మంత్రిగారి వ్యాఖ్యలు: ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, “గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, డాక్టర్ చినబాబు పేదలకు ఉచితంగా కేన్సర్ పరీక్షలు నిర్వహించి ఆదుకుంటున్నారని అభినందించారు. ఇది మంచి సేవ” అని తెలిపారు.
“హైదరాబాద్ ఈవెంట్‌లో 20,000 మంది పాల్గొన్నారని, ఇది క్యాన్సర్ అవగాహన పరుగులకు సంబంధించినంతవరకు భారతదేశంలోనే అతిపెద్దదని గమనించడానికి నేను సంతోషిస్తున్నాను. ఇది 130 దేశాలలో భౌతిక,వర్చువల్ రెండింటిలో ద్వంద్వ మోడ్‌లో నిర్వహించనున్న ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన రన్” అని ఆయన తెలిపారు.

ఆరోగ్యంపై ఫోకస్: “ఆరోగ్యమే సంపద. ఆరోగ్యానికి ఫిట్‌నెస్ ముఖ్యం. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. క్రీడల్లో మరింతగా ప్రోత్సహించేందుకు మన ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రకటించారు” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
రన్‌లో పాల్గొన్న ప్రత్యేక అతిథి: ఫరీదాబాద్‌కు చెందిన భారత తొలి బ్లేడ్ రన్నర్ కిరణ్ తనూజ ఈ రన్‌లో పాల్గొన్నారు. 3 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయస్సు గల వివిధ వర్గాల ప్రజలు ఈ రన్‌లో పాల్గొన్నారు. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం నిధుల సేకరణ కోసం ఈ రన్ నిర్వహించారు.
మరిన్ని సమాచారం: HYSEA, SCSC, CII, LIC ,అనేక ఇతర సంస్థలు ఈ రన్‌కు మద్దతు ఇచ్చాయి. ఇది రన్ 7వ ఎడిషన్.
సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గ్రేస్ (గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్) క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చినబాబు సుంకవల్లి “రన్ ఫర్ గ్రేస్ స్క్రీన్ ఫర్ లైఫ్” అనే థీమ్‌తో ఈ రన్ నిర్వహించనుందని తెలిపారు.

క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రజల జీవితాలపై అర్ధవంతమైన ప్రభావాన్ని చూపించడమే కాకుండా, సమాజంలో క్యాన్సర్‌ను నివారించడానికి ఎదుర్కోవడానికి శారీరక శ్రమను ప్రోత్సహించడం, నిరుపేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించేందుకు నిధులు సమీకరించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.