అదానీ లంచం కేసులో స్పందించిన ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, నవంబర్ 27, 2024: భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీపై ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సిపిఏ) కింద వచ్చిన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, నవంబర్ 27, 2024: భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీపై ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సిపిఏ) కింద వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవాలని అదానీ గ్రూప్ క్లారిటీ ఇచ్చింది.

ఇక ఈ విషయంపై దేశంలో ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరైన, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. “గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ, వినీత్ జైన్ మీద ఎఫ్‌సిపిఏ ఉల్లంఘనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు” అని ఆయన స్పష్టం చేశారు.

ఆరోపణల ప్రభావంతో..

గత కొద్దిరోజులుగా యూఎస్ ఎఫ్‌సిపిఏ కింద గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణల కారణంగా కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అయితే, ఈ ఆరోపణలన్నీ నిరాధారమైన వని తాజాగా కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ముకుల్ రోహత్గీ వ్యాఖ్యలు..

“నేను ఈ అంశాన్ని సవిస్తరంగా పరిశీలించాను. గౌతమ్ అదానీ , అతని మేనల్లుడిపై ఎలాంటి ఆరోపణలూ లేవని తేల్చి చెప్పగలను” అని ముకుల్ రోహత్గీ మీడియాకు వెల్లడించారు.

ఈ వివరణతో కంపెనీపై ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుందని ఆశిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలతో పాజిటివ్ పరిణామాల కోసం మార్కెట్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.

About Author