ఫాస్ట్ గోల్డ్ లోన్ సేవలను ప్రారంభించిన పూనావాలా ఫిన్‌కార్ప్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబయి, ఏప్రిల్ 16,2025: ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (పీఎఫ్ఎల్), ఇప్పుడు పసిడి రుణాల వ్యాపారంలోకి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబయి, ఏప్రిల్ 16,2025: ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (పీఎఫ్ఎల్), ఇప్పుడు పసిడి రుణాల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. సైరస్ పూనావాలా గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ, వ్యక్తులు,వ్యాపార అవసరాల నిమిత్తం సురక్షితమైన, వేగవంతమైన, పారదర్శక రుణ సదుపాయాలను అందించేందుకు ముందుకొచ్చింది.
కేవలం 30 నిమిషాల్లో రుణ ఆమోదం, తక్కువ డాక్యుమెంటేషన్, అనేక రకాల చెల్లింపు మార్గాలు వంటి ప్రత్యేకతలతో, తమ బంగారాన్ని అమ్మకుండానే రుణం తీసుకునే అవకాశం కస్టమర్లకు లభించనుంది. దీని ద్వారా వారు తమ సంపదను భద్రంగా ఉంచుకోవచ్చు.
Read this also…Poonawalla Fincorp Forays into Gold Loan Business to Strengthen Secured Lending Portfolio
Read this also…Axis Mutual Fund Joins ONDC Network to Broaden Access to Mutual Fund Investments
“సెక్యూర్డ్ రుణాల విభాగంలో భాగంగా పసిడి రుణాలను ప్రారంభించాం. బంగారానికి గల భావోద్వేగం, ఆర్థిక విలువను గుర్తించి, ప్రీమియం సేవలను పారదర్శకంగా అందించడమే మా లక్ష్యం” అని పూనావాలా ఫిన్‌కార్ప్ ఎండీ & సీఈఓ అరవింద్ కపిల్ వెల్లడించారు.

దేశంలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గోల్డ్ లోన్ డిమాండ్ పెరుగుతోందని, ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రుణాల కోసం తక్కువ రిస్కుతో కూడిన మార్గంగా పసిడి రుణాలు నిలుస్తాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో వచ్చే నాలుగు త్రైమాసికాల్లో దేశవ్యాప్తంగా 400 కొత్త శాఖలను దశలవారీగా ప్రారంభించాలన్న యోచనలో పీఎఫ్ఎల్ ఉంది. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కార్యకలాపాలను విస్తరించనుంది.
ఇది కూడా చదవండి..అమర్‌నాథ్ యాత్ర-2025: ఆఫ్‌లైన్-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ,తేదీలు-మార్గాలు.. పూర్తివివరాలు..
విలువ కట్టడం, భద్రత, గవర్నెన్స్ వంటి అంశాల్లో విశ్వసనీయత, పారదర్శకతకు అధిక ప్రాముఖ్యతనిస్తూ, తమ విలువైన బంగారాన్ని అమ్మకుండానే రుణం పొందేలా కస్టమర్లకు సరళమైన సేవలు అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది.
మరిన్ని వివరాల కోసం పూనావాలా ఫిన్‌కార్ప్ వెబ్‌సైట్ ను సందర్శించండి లేదా వారి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.