ప్రధాని మోడీ నాయకత్వంపై ప్రజల అచంచల విశ్వాసం మరోసారి రుజువు..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పిఠాపురం, నవంబర్ 14, 2025: గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దివ్య నాయకత్వంలోనే భారతదేశం సమగ్రాభివృద్ధి సాధిస్తుందని,
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పిఠాపురం, నవంబర్ 14, 2025: గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దివ్య నాయకత్వంలోనే భారతదేశం సమగ్రాభివృద్ధి సాధిస్తుందని, స్థిరమైన పాలన అందిస్తుందని దేశ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమి సాధించిన ఘన విజయం ఈ విశ్వాసాన్ని మరోమార ధృవీకరించింది.
బిహార్ ప్రజలు ఇచ్చిన ఈ బ్రహ్మాండమైన తీర్పు మోడీ పట్ల ఉన్న అపార ఆదరణకు, ఆయన సుస్థిర అభివృద్ధి దృక్పథం పట్ల ఉన్న నమ్మకానికి స్పష్టమైన నిదర్శనం. ఈ అద్భుత విజయానికి ముఖ్య కారకుడైన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.

బిహార్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ, విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక సదుపాయాల్లో అద్భుత ప్రగతి సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ పై ప్రజలు మరోసారి అందించిన అపార మెజారిటీ ఆయన సేవలకు అక్షరాలా అభినందనలా నిలిచింది.
ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర హోమ్ & సహకార మంత్రి అమిత్ షా కి, బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి. నడ్డా కి, ఎన్‌డిఏ నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు.
అలాగే, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి శుభాకాంక్షలు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అభినందనలు.