హైదరాబాద్‌లో పిబి పార్ట్‌నర్స్ తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 1,2025: పాలసీబజార్‌కి చెందిన పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ పర్సన్‌ (PoSP) విభాగమైన పిబి పార్ట్‌నర్స్ తెలంగాణలో తన ఉనికిని మరింత

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 1,2025: పాలసీబజార్‌కి చెందిన పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ పర్సన్‌ (PoSP) విభాగమైన పిబి పార్ట్‌నర్స్ తెలంగాణలో తన ఉనికిని మరింత బలోపేతం చేసింది. బుధవారం నగరంలోని తన తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సంస్థ ఘనంగా ప్రారంభించింది.

ఈ కార్యక్రమానికి సంస్థ సహ వ్యవస్థాపకుడు ధ్రువ్ సరిన్‌తో పాటు, హెల్త్ ఇన్సూరెన్స్ నేషనల్ సేల్స్ హెడ్‌ నీరజ్ అధానా, లైఫ్ ఇన్సూరెన్స్ అసోసియేట్ డైరెక్టర్ రాహుల్ మహేష్ మిశ్రా, కమర్షియల్ లైన్స్‌ విభాగం సేల్స్ హెడ్‌ రోహితశ్వ మిశ్రా, మోటార్ ఇన్సూరెన్స్‌ విభాగానికి చెందిన అమిత్ భడోరియా వంటి ప్రముఖులు హాజరయ్యారు. PoSP ఏజెంట్లు, హైదరాబాద్‌ బృందం, బీమా సంస్థల ప్రతినిధుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలనతో కేంద్రాన్ని ప్రారంభించారు.

Also read this…PBPartners Launches First Hyderabad Experience Center, Boosts Telangana Presence

Also read this…Music Meets Purpose: Songdew and MG Sewa Unveil Heartfelt Music Video Featuring Visually Impaired Students

పిబి పార్ట్‌నర్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 20కి పైగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను నడుపుతోంది. ఈ కేంద్రాలు ఏజెంట్ భాగస్వాములకు సంస్థతో నేరుగా మమేకమయ్యే అవకాశాన్ని కల్పిస్తాయి. వ్యాపార వ్యూహాలు, బీమా విస్తరణపై చర్చలు సాగించేందుకు ఇవి కేంద్రంగా నిలుస్తాయి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పిబి పార్ట్‌నర్స్‌కు 6,000 మందికి పైగా ఏజెంట్ భాగస్వాములుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే 2,712 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం సంస్థ దక్షిణ భారత మార్కెట్లో ప్రవేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

ఈ సందర్భంగా ధ్రువ్ సరిన్ మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించటం మాకు గర్వకారణం. ఏజెంట్ల శక్తివంతీకరణే మా ప్రధాన లక్ష్యం. దేశంలో ప్రతి మూలకు బీమా సేవలు అందించేందుకు ఈ కేంద్రాలు సహాయపడతాయి” అని తెలిపారు.

Also read this…SanDisk Launches WD Blue® SN5000 NVMe™ SSD in India for Content Creators and Professionals

Also read this…Muthoot FinCorp Launches Tranche V NCD Series to Raise Rs. 350 Crore

పిబి పార్ట్‌నర్స్ బీమా అందుబాటును పెంచుతూ, ఏజెంట్ భాగస్వాములకు మరింత సమర్థవంతమైన సేవలను అందించేందుకు అంకితభావంతో ముందడుగేస్తోంది.

About Author