స్వామిమలై శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 13,2025: సృష్టికి ఆదిప్రణవ మంత్రమైన ఓంకార రహస్యాన్ని అందించిన పవిత్రమైన స్థలం స్వామిమలై. ఇది ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో ఐదవది.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 13,2025: సృష్టికి ఆదిప్రణవ మంత్రమైన ఓంకార రహస్యాన్ని అందించిన పవిత్రమైన స్థలం స్వామిమలై. ఇది ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో ఐదవది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా గురువారం తంజావూరు సమీపంలోని స్వామిమలై శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకున్నారు.

ఇది కూడా చదవండి.. తిరువల్లం శ్రీ పరశురామ క్షేత్రాన్ని దర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ కన్నన్ గురుకల్ సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి, పంచహారతులతో హారతి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్థంభానికి మొక్కారు. స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు.

ఈ దర్శన యాత్రలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కూడా పాల్గొన్నారు.

Read this also..Quality Power Electrical Equipments Limited to Launch IPO on February 14, 2025

సుందరేశ్వరన్, మీనాక్షి అమ్మవారి ప్రత్యేక దర్శనం
శ్రీ స్వామినాథ స్వామి దర్శనానంతరం పవన్ కళ్యాణ్ ఆలయంలో వెలసిన ఆదిదంపతులు శ్రీ సుందరేశ్వర స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకు ముందు, ఉప ముఖ్యమంత్రివర్యులకు ఆలయ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఉమా దేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

About Author