శ్రీ తమిళిసై కుటుంబానికి పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 9,2025:తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ తండ్రి, మాజీ ఎంపీ కుమారి అనంతన్ మృతి పట్ల

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 9,2025:తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ తండ్రి, మాజీ ఎంపీ కుమారి అనంతన్ మృతి పట్ల జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఇది కూడా చదవండి...మార్క్ శంకర్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్య పరీక్షలు

ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో, “కుమారి అనంతన్ మరణ వార్త నా హృదయాన్ని దుఃఖంలో ముంచెత్తింది. పార్లమెంటు సభ్యుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి.

ఇది కూడా చదవండి...పంచాయతీల సమస్యల పరిష్కారానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మంచి వక్తగా, తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేతగా ఆయన పేరుగాంచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషాద సమయంలో తమిళిసై సౌందరరాజన్ కి, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.

About Author