అరుల్మిగు సోలైమలై మురుగన్ సేవలో పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 15,2025: తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలోని అళగర్ కొండల్లో వెలసిన అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని శనివారం ఉదయం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 15,2025: తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలోని అళగర్ కొండల్లో వెలసిన అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.
ఇది కూడా చదవండి..ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌సిసిబి సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి
Read this also.. Canon India Introduces Free Camera Colour Matching Application for Seamless Multi-Camera Video Production
క్షేత్ర విశిష్టతపై వివరణ – తీర్థప్రసాదం స్వీకారం
ఆలయ సంప్రదాయ ప్రకారం, అర్చకులు పవన్ కళ్యాణ్ కి క్షేత్ర విశిష్టతను వివరించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయంలో జరుగుతున్న స్కంద షష్టి కవచం, తిరుప్పుకల్ పారాయణంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ యాత్రలో ఆయన వెంట తనయుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు.

తిరుత్తణి దర్శనంతో యాత్ర పూర్తి
ఆలయ దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. షష్ట షణ్ముఖ యాత్రలో భాగంగా ఇప్పటికే అయిదు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించామని, సాయంత్రం తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనతో ఈ యాత్ర ముగుస్తుందని తెలిపారు.
ఇది కూడా చదవండి..ఫ్రెంచ్ ముద్దు: ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది..?
Read this also.. Kiss Day 2025: Five Benefits of Kissing..
పారిశుద్ధ్య కార్మికులతో ఆప్యాయ కలయిక
మురుగన్ దర్శనం అనంతరం ఆలయ పరిసరాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను చూసి, తన కాన్వాయ్‌ను ఆపి వారితో ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, వారితో సెల్ఫీలు తీసుకొని, ఆర్థిక సహాయం అందించారు.
పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.