ఆపరేషన్ సిందూర్‌ ఆగకూడదు… ఉగ్రవాద మూలాలను నశింపజేయాలి: పవన్‌ కళ్యాణ్‌

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, మే 8 ,2025: దేశంలో జరిగిన ఉగ్రదాడులకు సరైన బదులు ఇవ్వాల్సిన అవసరం ఎంత ముఖ్యమో పౌరులందరూ గుర్తించాలన్నారు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, మే 8 ,2025: దేశంలో జరిగిన ఉగ్రదాడులకు సరైన బదులు ఇవ్వాల్సిన అవసరం ఎంత ముఖ్యమో పౌరులందరూ గుర్తించాలన్నారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పహల్గాం ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులను హత్య చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. చివరి ఉగ్రవాదిని ఎరదించేవరకు ఆపరేషన్ కొనసాగాలని ఆకాంక్షించారు.

బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన… ‘‘ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి దేశం మొత్తం మద్దతుగా నిలవాలి. సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించొద్దు. దేశ భద్రతను కించపరిచే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు.

This is also read.. HYDRAA Gears Up with Own Police Station Launching Tomorrow in Hyderabad..

This is also read.. Over 165 IndiGo Flights Cancelled Until May 10 Due to Government Airspace Restrictions..

ఉగ్రవాదానికి భారత్ గట్టి బదులు
పహల్గాంలో మతం పేరుతో 26 మంది పర్యాటకులను హత్య చేసిన ఘాతుకానికి దేశం దుఃఖిస్తోంది. దీనిపై దేశం మొత్తం భద్రతాపరంగా చిత్తశుద్ధితో స్పందించాలన్నారు. ‘‘హిందువా? ముస్లిమా? అని అడిగి పర్యాటకులను చంపిన విధానం మానవత్వాన్ని మంటగలిపింది. భారత సైన్యం తాజాగా 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేయడం గర్వకారణం. ఇది ఆపరేషన్ సిందూర్ మొదటిస్దాయి మాత్రమే’’ అని చెప్పారు.

ఐక్యత అవసరం, సామాజిక మాధ్యమాల్లో జాగ్రత్త
ఈ క్లిష్ట సమయంలో ప్రజలంతా ఐక్యంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో అవిశ్రాంత వ్యాఖ్యలు చేయవద్దని, దేశ సైన్యాన్ని కించపరిచేలా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవన్నారు. ‘‘ఈ సమయంలో ప్రజలంతా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సెలబ్రిటీలు సైతం దేశ ప్రయోజనాల కోసం మౌనం విడిచి, దేశ సమగ్రతకు మద్దతుగా నిలవాలి’’ అని సూచించారు.

పాక్ కు అనుకూలంగా మాట్లాడటం దేశద్రోహమే
‘‘పాక్‌కు మద్దతుగా మాట్లాడే కాంగ్రెస్ నేతలు తమ వైఖరిని మార్చుకోవాలి. నేను అందరినీ కాక, కొన్ని వ్యాఖ్యలు చేసిన వారికి మాత్రమే వ్యాఖ్యానించాను. దేశంపై దాడి జరిగినప్పుడు మనం ఏకతాటిపై ఉండాలి. పాక్ మీద ప్రేమ ఉంటే అటుకెళ్లాలి అనే వ్యాఖ్యను తప్పుడు అర్థంలో తీసుకోవద్దు’’ అని స్పష్టం చేశారు.

This is also read.. Robinhood on ZEE5 & Zee Telugu..

మోచేతికి ముప్పు ఉంటే మనం మేల్కోవాలి
‘‘ఈ రోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్లులు జరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 974 కిలోమీటర్ల తీరాన్ని కలిగిన ఆంధ్రప్రదేశ్ కూడా ముప్పుకు లోనవుతుంది. గతంలో ఘాజీ లాంటి సబ్‌మెరైన్ విశాఖ వరకూ వచ్చింది. ఇదే బేస్‌గా అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో హద్దులు దాటి వ్యవహరించినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.

About Author